పరీక్షలు వస్తున్నాయి.. తెలంగాణ విద్యాశాఖకు మంత్రి ఎక్కడ?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రేవంత్ రెడ్డి Photo: Instagram||

ఈవార్తలు, తెలంగాణ: అసలే రాబోయేది పరీక్షల కాలం. అయితే, కీలక శాఖ అయిన విద్యాశాఖకు పూర్తిస్థాయిలో మంత్రి లేరు. 10వ తరగతి వార్షిక పరీక్షలతో పాటు ఎంసెట్ సీపీగెట్ తదితర ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 యొక్క వేలకు పైగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో 59 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటికి అదనంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ కాలేజీలను లక్షలాదిమంది విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కళాశాలలు చాలా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ ప్రైవేటు యూనివర్సిటీలు కేవలం ప్రభుత్వ పాఠశాలలోని  1. 05 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అన్ని శాఖలలో విద్యాశాఖ అనేది అతి ముఖ్యమైన విభాగం కూడా లక్షలాదిమంది విద్యార్థులు ఉద్యోగులతో ముడిపడి ఉన్న ఈ శాఖకు పూర్తిస్థాయి మంత్రిని ఇంకా ప్రభుత్వం నియమించలేదు.

ప్రస్తుతం ఆ శాఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉంచుకున్నారు. ఆయనే ఆ శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఒక పూర్తిస్థాయి మంత్రిని కేటాయించి నిత్యం పర్యవేక్షించవలసిన విద్యాశాఖకు ముఖ్యమంత్రి నియమించకపోవడం విమర్శలకు తావు ఇస్తుంది విద్యాశాఖలో ఎన్నో సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయి ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్ట పరచడం మన ఊరు మనబడి కింద మొదటి రెండు దశలోని ప్రభుత్వ పాఠశాలలో పనులు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. 317 జీవోకు సంబంధించి ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల సమస్యలు భాషా పండితుల పోస్టుల అబ్రిడేషన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేయడం లాంటి సమస్యలకు విద్యాశాఖలో నెలకొని ఉన్నాయి సీఎం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం లాంటి కార్యక్రమాలు విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు వార్షిక పరీక్షలకు సంబంధంఉంటుంది అధికారులలో భయము బాధ్యత కూడా ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు ఇప్పటికే చేపడుతున్నారు వీటిపై నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉండవలసిన అవసరం ఉంది ఒకవేళ ఈ శాఖకు ప్రత్యేక మంత్రి ఉంటే అధికారులకు కావలసినప్పుడల్లా సమీక్షలు చేసే వీలు ఉంటుంది పైగా అధికారులలో బాధ్యతాయుతంగా నడుచుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వం కట్టెలు చేయవలసిన బాధ్యత ఉంది నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజులు నియంత్రణపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు కార్పోరేట్ కళాశాలలపై ఉక్కు పాదంమోపవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోంది కొన్ని పాఠశాలల్లో తెలుగు ఆంగ్లం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితశాస్త్రం సబ్జెక్టులు బోధించేందుకు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు చదువులు ముందుకు సాగడం లేదు.

ఇంటర్ విద్యార్థులు పాటు యూనివర్సిటీల రూపురేఖలు మార్చవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పై ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనే భావనతో వారు ఉన్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో తమ గూడులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు తమ సమస్యలు నేరుగా మంత్రితో కలిసి చెప్పుకునేవారు అధికారులు కూడా ఏవైనా పాలనలు నియామకాలు తీసుకోవలసి వస్తే మంత్రితో భేటీ అయ్యేవారు కానీ ప్రస్తుతం ఆ శాఖకు మంత్రులు లేకపోవడం ఆ శాఖ సీఎం వద్దనే ఉండడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏదన్నా చర్చించాలన్న ఆయన దృష్టికి తీసుకొని పోవాలమ్మా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. అదే పూర్తిస్థాయి మంత్రి ఉంటే ఎప్పుడూ అంటే అప్పుడు ఆ శాఖ పనితీరుపై రివ్యూలు జరపవచ్చని విద్యా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణలో ఆ శాఖ ఎవరికో?

రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నదానిపై స్పష్టత మాత్రం లేదు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో సీఎంతో పాటు మొత్తం 18 మంది ఉండవచ్చు అయితే ప్రస్తుతం సీఎంతో పాటు 12 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు మిగిలిన హోం విద్యా తదితర కొన్ని శాఖలు ముఖ్య మంత్రి వద్దనే ఉన్నాయి. అయితే కీలక శాఖ అయిన విద్యాశాఖ ఎవరికి కట్టబెడతారు అనే చర్చ ప్రస్తుతం విద్యాశాఖలో జరుగుతుంది షబ్బీర్ అలీ జీవన్ రెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకొని వారిలో ఒకరికి ఈ శాఖను కట్టబెట్టవచ్చు అనే చర్చ జరుగుతోంది మొదటి మంత్రివర్గం విస్తరణలోని ఆ శాఖను ప్రస్తుత మంత్రులు ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని సీఎం భావించిన ఆ శాఖను తీసుకునేందుకు వారు సుముఖత చూపలేదని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విద్యాశాఖను సీఎం తన వద్దనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

వెబ్ స్టోరీస్