Google Layoffs | గూగుల్ ఇండియాలో 450 మంది ఉద్యోగాలు ఉఫ్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ Photo: Twitter||

టెక్ దిగ్గజం గూగుల్ వరుస లేఆఫ్స్ ప్రకటిస్తోంది. గూగుల్ లో పనిచేస్తున్న భారత దేశ ఉద్యోగులు 453 మందిని తొలగించారు. ఈ మేరకు గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఉద్యోగులకు ఈమెయిల్ పంపినట్లు తెలిసింది. గత జనవరి 20న 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తొలగించిన భారత  ఉద్యోగాలు ఇందులోన భాగమేనా లేదా అదనంగా వీరిని తొలగించారా అనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా దేశ ఉద్యోగులకు ఈ పాటికే  ఉద్యోగాల తొలగింపు పై క్లారిటీ ఇచ్చామని ఇతర దేశాల్లోని ఉద్యోగులకు సమాచారం ఇస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించి గూగుల్ ఉద్యోగులకు స్థానిక నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా రావాల్సినవన్నీ అందుతాయని సీఈఓ తెలిపారు. దీనిపై గూగుల్  ఉద్యోగులు తమ కష్టం పై ఫలితం లేకుండా పోతుంది అని ఆందోళనకు దిగారు. అయితే 25 సంవత్సరాల లో గూగుల్ మొదటిసారి ఎక్కువ మొత్తంలో ఉద్యోగులను తొలగించడంపై స్విట్జర్లాండ్ లోని 250 మంది గూగుల్ ఉద్యోగులు గురువారం ఆందోళన చేస్తున్నారు. న్యూయార్క్, కాలిఫోర్నియా ఆఫీసుల్లోనూ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనకి దిగారు. అయితే ఇతర టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, మెటా కూడా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో టెక్ ఆఫీసులో తమ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది అని సమాచారం.

వెబ్ స్టోరీస్