నీటి కొరతకు ప్రధాన కారణం అదే: డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్

జలం జీవనాధారం అని మీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుందని అందుకే ఎప్పుడు ఏడ తెగ కాపారు ఏరు ఉన్నచోటనే నివాసం ఎంపిక చేసుకోవాలని సుమతీ శతక కారుడు అన్నాడని మానవుడు చేస్తున్న ద్రోహమే నేడు నీటి కొరతకు కారణమని హ్యూమన్ రైట్స్ పౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాస్ అన్నారు.

human rights
ఏఎస్ శ్రీనివాస్

(రంగారెడ్డి ఈవార్తలు ప్రతినిధి, అక్కినే పల్లి పురుషోత్తమరావు)

జలం జీవనాధారం అని మీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుందని అందుకే ఎప్పుడు ఏడ తెగ కాపారు ఏరు ఉన్నచోటనే నివాసం ఎంపిక చేసుకోవాలని సుమతీ శతక కారుడు అన్నాడని మానవుడు చేస్తున్న ద్రోహమే నేడు నీటి కొరతకు కారణమని హ్యూమన్ రైట్స్ పౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాస్ అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయిన సురక్షితమైన మంచినీరు నేటికీ దేశ ప్రజలందరికీ అందివ్వలేకపోతున్నామని వేసవి వస్తుందంటే మంచినీటి సమస్య ముంచుకొస్తుందని ఆందోళన చెందడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు సాగునీటి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు అన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి కృష్ణ లాంటి జీవ నదులతో పాటు ఉపనదులు చిన్నాచితకా నదులు దాదాపు 40 వరకు ఉన్నాయని కానీ ప్రాణప్రదమైన నీటిని కాపాడుకునే సక్రమంగా వినియోగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ ఏటా లక్షలాది ఎకరాలు సాగుకు సరిపోయే నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అవుతుందని మరోపక్క వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలు నగరాలను గ్రామాలను ముంపుకు గురిచేసి ప్రాణాల మీద పుట్టిస్తుందని ప్రతి వానాకాలంలో వరద ముంపు అనేక ప్రాంతాలకు భారీ నష్టం తెచ్చిపెడుతుందని ఈసారి తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు దేశంలో దాదాపు 150 కి పైగా ఎలా చేయాలో నీరు అడుగంటినట్లు వార్తలు అందుతున్నాయని అన్నారు . 20021 జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదు కావడమే నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడానికి కారణం అని కేంద్ర జల సంఘం పర్యవేక్షిస్తున్న 42 ఎలా చేయాలో కేవలం 37% మాత్రమే నీరు మిగిలి ఉందని అధికారులు లెక్కలు చెబుతున్నాయని అన్నారు గత ఏడాది కన్నా 29% పదేళ్లలో సగటు కన్నా 16% తక్కువ వర్షపాతం ఉందని తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎందుకు భిన్నంగా లేదు అని ఏదో కొన్ని ప్రాంతాలలో తప్ప చిన్న నీటి వనరులన్నీ బోసిపోయాయని అన్నారు.

గతంలో ఈ చిన్న నీటి వనరులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే వారిని తెలుగు రాష్ట్రాల చరిత్ర పరిశీలించిన కాకతీయులు కానీ విజయనగరాదీశులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి సాగునీటికి ముఖ్యంగా చిన్న నీటి వనరులకు అగ్రతాంబూలం ఇచ్చారని చెప్పవచ్చునని వాన నీటిని వృధాగా పోనీయకుండా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక క్రమబద్ధీకరణ ద్వారా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారని వాగులు వంకలకు అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించి చిన్నచిన్న కుంటలు ఏర్పాటు చేయడం అవి నిండితే అలుగు ద్వారా నీటిని మరువ కుంటలోకి ఇలా వరుస కుంటలు చెరువులు ఏర్పాటు చేశారని వర్షాల వల్ల వస్తున్న నీటిని అంచనా వేసి చిన్న పెద్ద చెరువులను నిర్మించారని వరంగల్ జిల్లాలో రామప్ప పాకాల లక్కవరం అలాగే ఖమ్మం జిల్లాలోని పాలేరు ఆంధ్ర ప్రదేశ్ లోని కంభం తదితర చెరువులకు ఎందుకు ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు.

ఇలా రాజుల కాలంలోనూ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ కాలంలోనూ తెలుగు రాష్ట్రాలలో వేలాది చిన్న నీటి వనరులు ఏర్పాటు చేశారని అవి తెగిపోయి గళ్ళు పడిన ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తూ కూడికలు తీయిస్తూ అందులోనూ ఆ చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులను భాగస్వాములను చేస్తూ నీటి వనరులను కాపాడుకునే వారిని మొత్తం మీద నాటి పాలకులు సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు అనేది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో సజీవ సాక్షాలుగా మిగిలి ఉన్న వేలాది చిన్న నీటి వనరులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత మేరకు ప్రాముఖ్యత ఇచ్చిన ముఖ్యంగా 1980 తర్వాత తగ్గిపోయిందని చెప్పవచ్చు అని కానీ ఇవి రానురాను తగ్గిపోయి రికార్డులలో ఉన్న చిన్న నీటి వనరులకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవచెరులకు వ్యత్యాసం పెరిగిపోయిందని ఇలా చిన్న నీటి వనరుల అదృశ్యం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు.

కుంటలు చెరువులు లోతట్టు భూములు నిరుపేదలకు సాగుకు అనుమతి ఇవ్వడం ద్వారా వారికి జీవనోపాధి ఇటు ఉత్పత్తులు పెరుగుతాయని ఆలోచనకు అనుగుణంగా శికం భూములకు ఎక్ సాల్ పట్టాలు ఇచ్చినట్లు అధికార వర్గాలు వివరించిన ముఖ్యంగా భూగర్భ జలాల విషయంలో అనూహ్యంగా నష్టపోవాల్సి వచ్చింది అన్నారు జనవాసాలు విస్తరించే కొద్దీ కుంటల స్థానంలో ప్లాట్లు నిర్మాణం ప్రారంభం అయ్యాయని ఫలితంగా వేలాది చిన్న నీటి వనరులు అదృశ్యమైపోయాయని మరొక పక్క భూగర్భ జలాల వాడకం పెరగడం కుంటలు కనుమరుగు కావడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత తీవ్రమైందని అన్నారు. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి దారుణంగా తయారైపోతుందని మార్చి చివరి నాటికి తెలుగు రాష్ట్రాలలో మంచినీటికీ కటకట ఆరంభమైందని అన్నారు.

తెలుగు రాష్ట్రాలలో కోట్లాది రూపాయల మంచినీటి వ్యాపారం జరుగుతున్నదని ఇది ఏడాదికి ఏడాది పెరుగుతున్నదని ఈ వ్యాపారం ఇప్పుడు నగరాలు పట్టణాలకే కాక మండల కేంద్రాలు గ్రామాలు శివారు ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఏ కోణంలో చూసినా మంచినీటి పరిస్థితి రాను రాను క్లిష్టంగా మారిపోతుందని భూగర్భ జలమట్టాలు తగ్గడం మానవాళికి ఏమాత్రం క్షేమం కాదని మరోపక్క లక్షలాది ఎకరాలకు సరిపోయే వేలాది టీఎంసీల నీరు వివిధ నదుల నుండి పొంగిపొర్లి ఏట వృధాగా సముద్రం పాలవుతున్నదని నీటి వృధాను కూడా అదుపు చేయలేకపోతున్నామని పాలకుల చిత్తశుద్ధితో మంచినీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలని మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికగా చర్యలు చేపట్టాలని కోరారు.

వెబ్ స్టోరీస్