తెలంగాణలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కనేపల్లి పురుషోత్తమరావు)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 10 రోజులే ఉండడంతో ప్రచారంలో అభ్యర్థులు వేగాన్ని పెంచారు. చివరి దశకు ఎన్నికలు చేరుకోవడంతో ఉన్న అస్త్రాలు అన్ని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలవేళ మంచిగా చిల్ అవ్వవచ్చు అనుకున్న మందుబాబులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాష్ట్ర మొత్తం మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయాలని అని ఎన్నికల సంఘం తెలిపింది. నవంబర్ 28, 29, 30 తేదీలలో వరుసగా మూడు రోజులు వైన్ షాపులు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు అయితే తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 28 నుండి 30 వరకు వైన్ షాపులు బార్ షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు గత ఎన్నికలు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయం తీసుకోబోతోంది.

వెబ్ స్టోరీస్