చలికాలంలో మంచి స్వెట్టర్స్ కొనుక్కోవాలనుకొంటున్నారా.. హైదరాబాద్‌లో చవకకే దొరికే ప్రాంతాలివే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

చలి పులి పంజా విసరడం ప్రారంభమైంది. పగలంతా ఎండ ఉన్న సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. ఇప్పటికే చాలామంది తమ పాత స్వెటర్లు మంకీ క్యాప్ లు ధరించడం కనిపిస్తుంది. మాల్స్ వింటర్ కలెక్షన్స్ కనువిందు చేస్తున్నాయి. కానీ రెండు మూడు నెలలు వాడి వదిలేసే వాటికి వేలకు వేలు ఖర్చు చేయడం ఎందుకన్నది చాలామంది భావన. అందునా చిన్నారుల కోసం కొని వస్త్రాల దగ్గర ఎక్కువగా ఆలోచన చేస్తారు. జాకెట్స్ ఉలెన్ షూస్ బ్లౌస్ మంకీ క్యాపులు స్వెటర్లు వంటివి నిజానికి పేరు పొందిన వస్త్ర దుకాణాలు మనసులోని సరుకులతో పోల్చితే నేపాల్ టిబెట్ నుండి వచ్చి కోఠి తదితర ప్రాంతాలలో విక్రయించే వారి దగ్గర ఎక్కువ నాణ్యమైనవి తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంది అనేది నగరవాసి మాట. ఇప్పటికే వెలసిన తరచూ నగరంలో వింటర్లో ఎక్కువగా కనిపించే కొన్ని షాపింగ్లు కూడా ప్రాధాన్యం పొంది కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే...

కోఠి

కింగ్ కోటి మొదలు ఉస్మానియా మెడికల్ కాలేజీ సుల్తాన్ బజార్ కు అత్యంత ప్రాచుర్యం పొందిన షాపింగ్ సెంటర్ ఇది. దొరకని వస్తువు అంటూ దాదాపు ఇక్కడ లేదు కానీ వింటర్ వేర్ వరకు అపురూపమైన వస్త్ర కలెక్షన్లు ఇక్కడ లభిస్తాయి. కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి మరి ఉస్మానియా మెడికల్ కాలేజీ దగ్గరలో స్వెటర్లు జాకెట్లు క్యాపులు విక్రయించేవారు. ఇప్పుడు వరుసగా షాపులు తెరుస్తున్నారు. ధర ఎంత చెప్పినా బేరసారాలు సాగించాల్సిందే.

గౌలిగూడ

సిబీఎస్ బస్టాండ్ ఇన్ గెట్ అవుట్ గేట్ నడుమ వరుసగా శీతాకాలంలో రోడ్ల పక్కన వెలిసే నేపాలి మార్కెట్ మాత్రమే కాదు ఈ ప్రాంతంలోనే ప్రత్యేకంగా శీతాకాలంలో షాపింగ్ కార్నీ వాల్ ను కొనేళ్లుగా నేపాల్ టిబెటియలు నిర్వహిస్తున్నారు. జర్కింగ్ మొదలుకొని స్టాకింగ్ వరకు ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు.

టిబెటియన్ ఉలెన్ మార్కెట్ చాదర్‌ఘాట్

టిబెట్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ శీతాకాలంలో వస్త్రాలు విక్రయిస్తారు పూర్ బౌల్స్, స్టోల్స్, షాల్స్, మంకీ క్యాప్ ఇలా అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి.

జనరల్ బజార్ సికింద్రాబాద్

నగరానికి పరిచయం అవసరం లేని మార్కెట్ ఇది. శతాబ్దాలుగా నగరవాసి షాపింగ్ అవసరాలను తీర్చే ప్రాంతం ఇది. ఈశాన్య రాష్ట్రాల వారు ఇక్కడ కనిపించరు కానీ ఉలెన్ వస్త్రాలు వినియోగాలభ్యమవుతాయి ఇవి కాక అమీర్పేట, ఎల్బీనగర్, మూసాపేట, కూకట్పల్లి లాంటి ప్రాంతాలలో సైతం రోడ్డు సైడు నేపాలిటీయలు వింటర్ వేర్ విక్రయిస్తున్నారు.

వింటర్ వేర్ ఎంపిక ఇలా

ఆన్లైన్ షాపింగ్ కు ఆదరణ పెరిగిన తర్వాత చాలామంది ఇంటర్ కలెక్షన్లు కొంటున్నారు. ఏదో ఒక మూల సందేహం తమకు తగిన రీతిలో అవి ఉంటాయా? ఉండవా? మెటీరియల్ ఎలాంటిది ఎంచుకోవాలి ఇలా ఎన్నో సందేహాలు ఆన్లైన్లో వింటర్ జాకెట్లను కొనుగోలు చేసే ముందు ఏమి చూడాలంటే ఈ వింటర్ వెతదనం పొందండి శీతాకాలపు శోభను ఆస్వాదించండి అంటూ ఈజీ జాకెట్ లను వెస్ట్ నయుడు విడుదల చేసింది. తమ ఈ టి ఏ బ్రాండ్ తో స్టాల్ ఫాల్స్ ను విడుదల చేసింది మహిళల కోసం లవ్ యు ఎన్ అంటూ నెట్ వేర్ లెర్నింగ్ ఆప్షన్ అందిస్తుంది.

నగరంలో విక్రయ కేంద్రాలు ఎన్నో

సాధారణంగా వింటర్ జాకెట్లు మూడు రకాలుగా లభిస్తూ ఉంటాయి. మీరు చెయ్యబోయే యాక్టివిటీలు ఏమిటో తెలుసుకొని దానికి తగినట్టుగా జాకెట్ తీసుకోవాలి. క్యాజువల్ పార్టీలకు ధరించే జాకెట్స్ అన్నివేళలా ఉపయోగపడుతుందని అనుకోవద్దు. అవుట్డోర్ యాక్టివిటీలు ఎక్కువగా చేసేవారు అది లైట్ వెయిట్ జాకెట్ లను కోరుకునేవారు టెక్నికల్ జాకెట్లను ఎంచుకోవడం మంచిది. ఈ తరహా జాకెట్లలో ఫిట్ జిప్స్ హెల్మెట్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది.చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను సందర్శించాల్సి వస్తే క్యాజువల్ వింటర్ కోర్సు తరహా జాకెట్లు బాగుంటాయి. సాధారణంగా చలి ఉంటే ఉల్ లేదా కాటన్ జాకెట్స్ ఓకే. ఇవి వద్దనుకుంటే థర్మల్ కూలర్ ప్లేస్ లెదర్ లాంటివి ట్రై చేయవచ్చు. సోలార్ ప్లస్ మెటీరియల్ శరీరాన్ని వెచ్చగానే ఉంచుతూనే శరీరం శ్వా సించే అవకాశం కల్పిస్తుంది. లేయర్స్ ధరించడం ఇష్టం లేని వారికి థర్మల్ వేరు బాగుంటుంది. ఫ్యాషన్ బైకర్లు కు లెదర్ క్యాజువల్ ఔటింగ్ అయితే డెమో జాకెట్లు బాగుంటాయి. ఇక్కడ చూడవలసిన మరో అంశం వుడ్ జాకెట్ కు వుడ్ ఉంటే శరీరం వేడి బయటకి పోకుండా కాపాడుకోవడంతో పాటు వెచ్చగా ఉంటుంది. జాకెట్ కొనేటప్పుడు చూడవలసిన మరో అంశం పాకెట్లు సౌకర్యవంతమైన రీతిలో జాకెట్ కు పాకెట్లు ఉండడం వల్ల ఫోన్స్ వాలెట్ లాంటి భద్రపరచుకోవచ్చు చివరగా చూడవలసినది ఫిట్ మనం వాడే సందర్భాన్ని బట్టి మంచిది చలి బాగా ఉంటే లేయరింగ్ అత్యుత్తమ అవకాశం కాబట్టి ఆ తరహా లోనే దీనిని ఎంచుకోవాలి. జాకెట్ ఎంచుకున్నప్పుడు కలరింగ్ కూడా ముఖ్యమే కాలేజీ లేదా వర్క్ ప్లేస్ లో ధరించాలి అంటే డార్క్ కలర్స్ ఎంచుకుంటే బెటర్ అదే వీకెండ్ పార్టీలకైతే రెడ్ గ్రీన్ లాంటి కలర్స్ ఎంచుకోవాలి.

వెబ్ స్టోరీస్