Michaung Cyclone | బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిగ్‌జాం తుఫాను

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిగ్‌జాం తుఫాను||

మిగ్‌జాం తుఫాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో గంట వ్యవధిలో పూర్తిగా తీరాన్ని దాటనుందని వెల్లడించారు. మిగ్‌జాం తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో బాపట్ల, సమీప తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వానలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు సుమారు 2 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

వెబ్ స్టోరీస్