TCS Layoffs Clarity | ఆర్థిక మాంద్యం వేళ ఉద్యోగుల తొలగింపుపై టీసీఎస్ కీలక ప్రకటన

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్||

తాజాగా ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థలు ఆర్ధిక మాద్యం ఏర్పడుతోందన్న భయాలతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రం తమకు ప్రతిభ గల ఉద్యోగులను తయారు చేసుకొంటామని చీఫ్‌ హెచ్‌ఆర్ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. దీనితోపాటు తమ కంపెనీలో ఒక సారి ఉద్యోగం సంపాదించిన ఉద్యోగికి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడం జరగదని పేర్కొన్నారు. ఒకవేళ నైపుణ్యంలో లోటు వస్తే తమకు శిక్షణను ఇచ్చి ప్రతిభవంతులుగా చేస్తామన్నారు. అయితే కొన్ని సంస్థలు తమకు కావలసిన ఉద్యోగుల కంటే ఎక్కువ ఉద్యోగులను చేర్చుకోవడం వల్ల ఇలా లేఆఫ్స ప్రకటించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఆరు లక్షలకు పైగా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గత సంవత్సర మాదిరిగానే వేతనాలు పెంచుతూ ప్రకటన చేయబోతుందన్నారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌లోని అనేక అంశాలు, ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో ప్రతిభ కోసం సెర్చ్ చేస్తున్నామన్నారు. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతానికి 40 శాతం వారానికి మూడు రోజులపాటు ఆఫీస్, 60 శాతం మంది వారానికి రెండు సార్లు వర్క్ ఫ్రం ఆఫీస్ చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రతిభవంతులైన ఉద్యోగులను తమ కంపెనీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు.

వెబ్ స్టోరీస్