EPFO Interest : ఖరారైన ఈపీఎఫ్ వడ్డీ రేటు.. ఈ ఏడాది ఎంతంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, బిజినెస్ న్యూస్: ఉద్యోగుల భవిష్య నిధి (employees provident fund) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 సంవత్సరానికిగానూ 8.15 శాతం వడ్డీ రేటు (8.15 percent rate of interest)ను నిర్ణయిస్తూ, కేంద్రానికి ఈపీఎఫ్‌వో (epfo) ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు 8.10 శాతం ఉండగా, ఈ సారి 8.15 శాతంగా నిర్ణయించింది. మంగళవారం ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (epfo cbt) సమావేశంలో 2022-23కి గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ(finance ministry)కు పంపనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో అధికారికంగా నోటిఫై చేయనుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌వో 5 కోట్ల ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.

సీబీటీ ప్రతిపాదనలపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గత పదేళ్ల వడ్డీ రేట్లను పరిశీలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.8 శాతంగా ఉండేది. తర్వాత తగ్గుతూ వచ్చింది. కరోనా తర్వాత మరింత తగ్గింది. ఇప్పుడు మరీ దారుణంగా 8.15 శాతానికి పడిపోయింది.

వెబ్ స్టోరీస్