టికెట్ రద్దుతోనూ భారీగా సంపాదించిన రైల్వే శాఖ.. ఏకంగా 2 వేల కోట్లు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||భారత్ రైల్వే||


భారత్ రైల్వే కు ఈ-టిక్కెట్లు, కంప్యూటరైజ్డ్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్ల ద్వారా కేన్సిలేషన్, కన్వీనియెన్స్ ఫీ ద్వారా 2019-20 నుంచి 2022 డిసెంబరు వరకు రూ.1,949.98 కోట్లు వసూలు చేసింది. ఈ-టికెట్ల రద్దు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 డిసెంబర్ వరకు 1298.48 కోట్లు వచ్చాయి. 2015  రైల్వే పాసింజర్స్ రూల్స్ ప్రకారం ఈ రుసుమును వసూలు చేస్తునట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఏసీ తరగతుల్లో ప్రయాణించేనందుకు టికెట్ బుక్ చేసుకుని క్యాన్సల్ చేసుకున్న వారికి రూ. 30 ( నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు) , రూ. 20 (UPI) వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నాన్ ఏసీ తరగతిలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న వారికి రూ. 15 ( బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు) , రూ. 10 (UPI) వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా టికెట్ బుక్ చేసుకునేందుకు టికెట్ కౌంటర్ వద్ద నిలబడాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. రైల్వేస్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ద్వారా ఈ మొబైల్ టికెట్ అప్లికేషన్  తయారు చేశారు. Unreserved Ticketing System(UTS) యాప్ ప్రస్తుతం మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంది.

వెబ్ స్టోరీస్