PAN-Aadhar Link : ఆధార్‌తో పాన్ లింక్ గడువును పెంచిన కేంద్రం.. ఎప్పటి వరకు అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||Image 1||

ఆధార్‌తో పాన్ లింక్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి మార్చి 31 వరకు గడువు ముగియాల్సి ఉండగా, దాన్ని మరో మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే.. జూన్ 30 వరకు ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. అప్పటికీ లింక్ చేయకపోతే పాన్‌ నిరుపయోగంగా మారుతుందని స్పష్టం చేసింది. 

ఇంకా ఆధార్-పాన్ లింక్ చేయనివారు.. రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి ఆధార్‌తో అనుసంధానం చేయాలి. లేకపోతే, ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా 51 కోట్ల పాన్‌లు ఆధార్‌తో లింక్ అయ్యాయి.

వెబ్ స్టోరీస్