SBI | ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈనెల 17 నుండి క్రెడిట్ కార్డ్ సర్వీస్ చార్జీలను పెంచింది. కొత్తగా పెంచిన  చార్జీల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిన ఈమెయిల్ లో మార్చి 17 నుండి కొత్త సర్వీస్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డు సర్వీస్ ఛార్జీలను రూ.99 నుంచి రూ.199 కి పెంచింది. ఇక ఈ 199 రూపాయలకు జీఎస్టీ, ఇతర పన్నులు అదనంగా ఉండనున్నాయి. సవరించిన సర్వీస్ చార్జీలను ఈనెల 17 నుండి అమలులోకి వస్తాయని తెలియజేసింది. జీఎస్టీలను ప్రత్యేకంగా వసూళ్లు చేయడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిన ఈమెయిల్ చర్చనీయంగా మారింది.

వెబ్ స్టోరీస్