Telangana Budget 2023-24 | తెలంగాణ బడ్జెట్‌లో ఏయే శాఖకు ఎన్ని కోట్లు అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు  ||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: 2023-24 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏయే శాఖకు ఎంత కేటాయింపులు చేశారో వెల్లడిస్తున్నారు. 

వ్యవసాయ రంగానికి - రూ.26,831 కోట్లు

నీటిపారుద‌ల శాఖ‌కు రూ.26,885 కోట్లు

విద్యుత్ కేటాయింపులు రూ.12,727 కోట్లు

ఆస‌రా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు

ద‌ళిత‌బంధు కోసం రూ.17,700 కోట్లు

బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

మ‌హిళా, శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు

ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు

మైనారిటీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

గిరిజ‌న సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు

విద్య రంగానికి రూ.19,093 కోట్లు

వైద్య రంగానికి రూ.12,161 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు

ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు

అట‌వీ శాఖకు రూ.1,471 కోట్లు

పంచాయ‌తీ రాజ్‌కు రూ.31,426 కోట్లు

హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ.1471 కోట్లు

రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ.6,385 కోట్లు

పుర‌పాల‌క శాఖ‌కు రూ.11,372 కోట్లు

రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ.2,500 కోట్లు

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ.200 కోట్లు

ప‌ల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ.12,000 కోట్లు

ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ.1,463 కోట్లు

ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు

ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ.366 కోట్లు

ఉన్నత విద్యాశాఖకు రూ.3,001 కోట్లు,

న్యాయశాఖకు రూ.1,665 కోట్లు

ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1,000 కోట్లు

జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్

వెబ్ స్టోరీస్