Zomato | 225 నగరాల్లో జొమాటో సేవలు బంద్.. ఎందుకో తెలుసా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాలు, పట్టణాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నగరాల్లో వ్యాపారం అనుకున్నంత పెరుగుదల నమోదు కాలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ‘గ్రాస్‌ ఆర్డర్‌ విలువ 0.3 శాతం మాత్రమే ఉంది. ఇది మా వ్యాపారానికి ఎంత మాత్రం ఉపయోగం కాదు. కంపెనీ దీర్ఘకాల లక్ష్యాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించింది. అయితే, 225 నగరాల్లో ఏయే నగరాలు ఉన్నాయన్న సంగతిని జొమాటో బహిర్గతం చేయలేదు. 

కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల చేసిన జొమాటో.. గత అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్‌లో రూ.346.6 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఫుడ్ డెలివరీ రంగంలో మందకొడి వ్యాపారమే కారణమని ఆ సంస్థ భావిస్తోంది. కాగా, ఈ మధ్యే టెక్ ఉద్యోగులకు జాబ్ ఇస్తామని జొమాటో సీఈవో ప్రకటించారు. అంతలోనే 225 నగరాల్లో సేవలు నిలిపివేస్తామని చెప్పడంపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మార్కెట్‌లో తన పేరును అడ్వర్టైజ్ చేసుకొనే ఎత్తుగడ అని విమర్శిస్తున్నారు.

వెబ్ స్టోరీస్