Samantha | తెలుగు సినిమాలకు సమంత గుడ్‌బై?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||సమంత Photo: Instagram||

ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్ : అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya)తో విడాకులు అయ్యాక సమంత (samantha) శారీరకంగా, మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యింది. ఇదే విషయాన్ని తాను అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. విడాకుల (divorce) ప్రకటన చేసిన వెంటనే తాను పుష్ప (Pushpa) సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ఆడిపాడింది. అయితే, అప్పటి నుంచే సమంత టాలీవుడ్‌(Tollywood)కు గుడ్‌బై చెప్పబోతోందన్న గుసగుసలు వినిపించాయి. ఇక తెలుగులో సినిమాలు (Telugu movies) చేసేందుకు ఒప్పుకోవడం లేదన్న వదంతులు వ్యాప్తి చెందాయి. అప్పటికే శాకుంతలం (Shakuntalam) సినిమాను ఒప్పుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమా చేసిందన్న మాటలు వినిపించాయి. అయితే, వీటిపై సమంత ఎప్పుడూ నోరు విప్పలేదు. కాకపోతే, ఈ మధ్య సమంత తీరు సినీ వర్గాల్లో, అటు మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తు్న్నాయి.

దేశం మొత్తం తిరిగి శాకుంతలం సినిమాకు ప్రమోషన్ చేసిన సమంత.. తెలుగులో మాత్రం దూరంగా ఉంది. అదేంటంటే.. ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయిందని చెప్తోంది. మొన్నమొన్నటిదాకా సమంత బాగానే ఉంది. అప్పుడు కూడా ఏ మీడియా చానల్‌కు నేరుగా ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. తెలుగు మీడియా వర్గాల నుంచి ఫోన్ వస్తే చాలు.. తనకేం పట్టన్నట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కావాలనే తెలుగు మీడియాను దూరం పెడుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమంత ఇప్పటి వరకు స్పందించకపోయినా, టాలీవుడ్‌ నుంచి దూరంగా వెళ్లాలన్న ఆలోచనతోనే తెలుగు సినిమాలు ఒప్పుకోవడం లేదని, తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి, మీడియా ఇంటర్వ్యూలకు వెళ్తే వ్యక్తిగత విషయాలు అడిగి ఇబ్బంది పెడతారని సమంత ఆలోచించి ఉండవచ్చు. కానీ, సినిమా అన్నప్పుడు ప్రమోషన్ చేయాలి. అది ఏ భాషలోనైనా. పైగా, తెలుగులోనే ఎదిగి పైకి వచ్చిన సమంత.. తెలుగు మీడియానే దూరం పెట్టడం మీడియా వర్గాల్లో తీవ్ర కోపానికి కారణమైంది.

తెలుగులో సినిమాలు మానేసి ముంబై వెళ్లి సెటిల్ అవుదామనుకుంటున్న సమంత.. అక్కడ తనకు ఏవిధంగా సహాయసహకారాలు అందుతాయన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌లో నటించిన సమంత.. ఆ సమయంలోనే నాగచైతన్యకు దూరమైందని టాక్. ఇప్పుడు అక్కడికి వెళ్లినా, టాలీవుడ్‌ను, తెలుగు మీడియాను దూరం పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చూద్దాం.. ఇప్పటికైనా సమంత స్పందిస్తుందా? లేదా?


వెబ్ స్టోరీస్