గురువు బాటలో హీరో నితిన్.. పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్‌తో కొత్త సినిమా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||నితిన్ కొత్త సినిమా పేరు ’తమ్ముడు‘||

Nitin Thammudu | పవన్ కల్యాణ్‌ అంటే ఎనర్జీ.. పవర్ స్టార్ అంటే ఆరాధ్యదైవం. ఎంతో మంది యువ హీరోలకు స్టైల్ అంటే ఏంటో నేర్పింది జనసేనాని. అందుకే పవర్ స్టార్ నవ్వితే చాలు అనుకొనే హీరోలెందరో. అందులో ఒకడు నితిన్. పవన్ కల్యాణ్ అంటే చచ్చేంత అభిమానం. అవసరమైన ప్రతీ సందర్భంలో తన గురువుపై ఉన్న అభిమానాన్ని చాటు కుంటూనే ఉన్నాడు. ఇంతకుముందు చాలా సినిమాల్లో పవన్ కల్యాణ్‌ను ఫాలో అయ్యాడు కూడా. అయితే, తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌తో తన బంధాన్ని గుర్తుచేశాడు. తాను చేయబోయే సినిమాకు పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా తమ్ముడు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మధ్య నితిన్ చేసిన సినిమాలు వరుసగా ఫట్ అయ్యాయి. భీష్మ తర్వాత ఏ హిట్టూ కొట్టలేదు. చెక్, రంగ్‌దే, మ్యాస్ట్రో ఇలా వరుస డిజాస్టర్లు చవిచూశాడు. మాచర్ల నియోజకవర్గం కొంచెం బెటరే అయినా, గాడిలో పెట్టలేకపోయింది.ఇప్పుడు వక్కంతం వంశీ సినిమాలో నటిస్తున్నాడు. ఆర్డినరీ మ్యాన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పోస్టర్, పాటలు రిలీజ్ అయ్యాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా నితిన్ కొత్త సినిమాను ప్రారంభించాడు. ఎంసీఏ, వకీల్‌సాబ్ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చకున్న వేణుశ్రీరాంతో నితిన్ తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. దీనికి సంబంధించి తాజాగా, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా తమ్ముడు ‘టైటిల్’ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. 

వకీల్ సాబ్ సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ మరో సినిమా చేయలేదు. అల్లు అర్జున్‌తో ఐకాన్ అని ప్రకటించినా, అది పట్టాలెక్కలేదు. ఆ కథను రామ్ పోతినేనితో చేయాలని చూసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు అదే కథను నితిన్‌కు చెప్పగా, ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

వెబ్ స్టోరీస్