National Awards 2023 | తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. జాతీయ అవార్డుల్లో తెలుగోళ్ల ప్రభంజనం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

National Awards 2023 | తగ్గేదేలే.. పుష్పలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. సినిమాలోనే కాదు.. అవార్డులు కొల్లగొట్టడంలోనూ తగ్గేదేలే అంటున్నాడు ఈ స్టైలిష్ స్టార్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. పుష్ప సినిమాలో నటనకు గానూ అల్లు అర్జున్‌కు ఈ అవార్డు దక్కడం గమనార్హం. ఉత్తమ హీరోయిన్లుగా ఆలియాభట్ (గంగూబాయి కతియావాడి), కృతి సనన్ (మిమి) సినిమాలకు ఎంపికయ్యారు. తెలుగు నాట ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ఫీచర్‌ ఫిల్స్మ్‌కు  31 విభాగాల్లో, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు 24 విభాగాల్లో, రచనా విభాగానికి 3 విభాగాల్లో అవార్డులు ప్రకటించారు.

ఉత్తమ అవార్డులు వీరికే..

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప)

ఉత్తమ నటీమణులు - అలియాభట్‌ (గంగూబాయ్ కథియావాడి), కృతిసనన్‌ (మిమి)

ఉత్తమ చిత్రం - రాకెట్రీ - ది నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)

ఉత్తమ దర్శకుడు - నిఖిల్‌ మహాజన్‌ - గోదావరి (మరాఠీ)

ఉత్తమ సహాయనటి - పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్‌ (హిందీ))

ఉత్తమ సహాయ నటుడు - పంకజ్‌ త్రిపాఠి (మిమి(హిందీ))

బెస్ట్‌ ఎడిటర్‌ - ఎడిటర్ - సంజయ్ లీలా బన్సాలీ (గంగూబాయ్‌ కథియావాడి)

ఉత్తమ స్క్రీన్‌ప్లే - నాయట్టు (మలయాళం)

ఉత్తమ తెలుగు సినిమా - ఉప్పెన

బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ - కింగ్ సోలోమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ - ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ - ఎంఎం కీరవాణి

ప్లేబ్యాక్ సింగర్‌ - కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (వుమన్) - శ్రేయఘోషల్‌ (ఇరివిన్‌ నిజాల్‌ (మాయావా ఛాయావా))

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ - ఆర్ఆర్‌ఆర్‌

బెస్ట్ పాపులర్ సినిమా - ఆర్‌ఆర్‌ఆర్‌

ఉత్తమ లిరిసిస్ట్ - చంద్రబోస్‌ - కొండపొలం

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ - దేవీ శ్రీ ప్రసాద్‌ (పుష్ప)

బెస్ట్‌ తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్‌ - పురుషోత్తమాచార్యులు

బెస్ట్‌ హిందీ ఫిల్మ్‌- సర్దార్‌ ఉదమ్‌

బెస్ట్‌ గుజరాతీ ఫిల్మ్‌ - ఛల్లో షో


వెబ్ స్టోరీస్