స్వాతంత్ర్యం అంటే ఒకడు ఇచ్చేది కాదు లాక్కునేది.. నేతాజీ చెప్పారు.. ఉత్కంఠ రేపుతున్న నిఖిల్ స్పై ట్రైలర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||స్పై సినిమా వాల్ పోస్టర్ Photo: twitter||

నిఖిల్ సిద్ధార్థ్.. తెలుగులో సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ హిట్లు కొడుతున్న యువ హీరో. కార్తికేయ-2 సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో.. 18 పేజెస్ సినిమాతో రాగా, ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న సినిమా స్పై. ఈ మధ్య రిలీజైన టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా దేశంలోనే మోస్ట్ సీక్రెట్‌గా ఉన్న సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని ఉద్దేశించి ఈ సినిమాను తీసినట్టు టీజర్‌లో చూపించారు. అయితే, గురువారం సాయంత్రం స్పై సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మువీ మేకర్స్ విడుదల చేశారు. వాస్తవానికి, ఉదయం పదకొండున్నరకే విడుదల చేస్తామని ప్రకటించినా, సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం విడుదల చేస్తామని వెల్లడించింది.

అనుకున్నట్టుగానే సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగానే సినిమాను తీసినట్టు అవగతం అవుతోంది. దేశంలో అతిపెద్ద రహస్యాన్ని మేం ప్రపంచానికి తెలియజెప్పబోతున్నాం అంటూ ట్రైలర్‌లో సినిమాపై ఆసక్తిని పెంచారు. చివర్లో దగ్గుపాటి రానా ఎంట్రీ ప్రేక్షకులకు కాస్త కిక్ ఇచ్చింది. పైగా, స్వాతంత్ర్యం అంటే ఒకడు ఇచ్చేది కాదు.. లాక్కునేది, ఇది నేను చెప్పింది కాదు.. నేతాజీ చెప్పారు అంటూ చెప్పిన డైలాగ్ సూపర్. అటు.. ఈ సినిమా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న స్పై సినిమాకు.. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆర్యన్ రాజేశ్, సన్యాఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్నారు. గ్యారీ బిహెజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

వెబ్ స్టోరీస్