Salaar Movie Review | ప్రభాస్ సలార్ సినిమా ఎలా ఉందంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సలార్||

ఈవార్తలు, సినిమా వార్తలు: ఖాన్సార్ అరాచక సామ్రాజ్యంలో ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యానికి నాలుగు వైపుల బలమైన గోడలు నిర్మించి అక్కడి రాజు రాజమ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) సామ్రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఆయన కుర్చీపై చిన్న చిన్న దొరల కన్ను పడుతుంది. అదే సమయంలో రాజ మ‌న్నార్ తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని దొర‌గా చేయాలని నిర్ణయించుకుంటాడు. రాజ్యం పనిపై కొన్ని రోజులు బయటికివెళ్తాడు. ఈలోగా సింహాసనం కోసం అంతర్యుద్ధం మొదలవుతుంది. మిగ‌తా దొర‌లంతా కలసి వరదమన్నార్‌ను అంతం చేయాలని చిన్న చిన్న సైన్యాలను తయారుచేసుకుంటారు. కానీ వరద మన్నార్ మాత్రం ఓ కటౌట్‌ను నమ్మి ధైర్యంగా ఉంటాడు. ఆ కటౌటే.. తన చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్‌). దేవాను పిలిపించడంతోనే అసలు సినిమా రక్తి కడుతుంది. అసలు దేవ ఎవరు ? వరద, దేవాల మధ్య అనుబంధం ఏమిటి? అంత సైన్యాన్ని దేవా ఒక్కడే ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో ఆద్య (శ్రుతిహాస‌న్) పాత్ర ఏంటి? సింహాసనం కోసం జరిగిన ఈ యుద్ధంలో నాటకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి ? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే.. 

దేవా, వరద బాల్యంతో ఈ కథని మొదలుపెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దేవ, వరద స్నేహం, దేవ కోసం వరద చేసిన త్యాగం, అందుకుగాను దేవ ఇచ్చిన మాట ఇవన్నీ ఆసక్తికరంగా వుంటాయి. తర్వాత కథ అధ్య (శ్రుతి హసన్) పాత్ర వైపు నుంచి నడుస్తుంది. అద్య, దేవ తల్లి ఈశ్వరీరావు వద్ద ఆశ్రయం పొందడం, అక్కడే దేవ పరిచయం, మరోవైపు ఖాన్సార్ సీల్ తో కొన్ని పాత్రలు తెరపైకి రావడం ఆసక్తికరంగా వుంటుంది. దేవగా ప్రభాస్ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన తీరు పవర్ఫుల్‌గా ఉంటుంది. ఆధ్య పాత్ర ఫస్టాఫ్‌లో కీలకం. అధ్యని విలన్ల నుంచి కాపాడే సన్నివేశంలో, ఇంజన్ స్టార్ అవ్వడానికి ముందు వచ్చే సౌండ్ ఎఫెక్ట్ ని వాడుకున్న తీరు ప్రభాస్ కటౌట్‌కి అచ్చు గుద్దినట్టు సరిపోయింది. ఆ యాక్షన్ సీన్ టెర్రిఫిక్.

- ఇంటర్వెల్ బాంగ్ మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటారు. 

- ఖాన్సార్ సీల్ బ్యాగ్ డ్రాప్ ని కాయిన్ చేసిన విధానం మాస్ ఫాలోవర్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.

- ఫస్టాఫ్ అంతా ప్రభాస్ పాత్రకు ఒక పవర్ ఫుల్ ఇంట్రో అనుకోవచ్చు.

- సెకండ్ హాఫ్ లో అసలు ఖాన్సార్ కథ తెరపైకి వస్తుంది.

- సినిమా కోసం ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత అరాచక రాజ్యాన్ని సృస్టించాడు ప్రశాంత్ నీల్.

- అయితే ఖాన్సార్ రాజ్యాంగం, దాని రూల్స్, అధికారం కొంచెం గందరగోళం అనిపిస్తాయి.

- ప్రభాస్ రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత కథ జోరందుకుంటుంది.

- కాళీమాత ఎపిసోడ్ ఫ్యాన్స్ కి భలే కిక్ ఇస్తుంది. 

- దేవా పాత్రలో ప్రభాస్ తప్ప మరెవరూ సూట్ అవ్వరు అనేలా ఉంటుంది.

- వరద రాజమన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర బాగుంటుంది. శ్రుతిహాసన్‌ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు.

- జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి, బాబీ సింహా, శ్రియారెడ్డి, ఝాన్సీ ఇలా పాత్రలు ప‌రిధి మేర‌ ఆకట్టుకున్నాయి.

సాంకేతిక అంశాలు:

- సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. 

- నేపథ్య సంగీతం మైండ్ బ్లోయింగ్.

- ప్రభాస్ ఎలివేషన్స్ సీన్స్ లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్

- కెమెరా పనితనం, ఎడిటింగ్ ప్యాట్రన్ ప్రశాంత్ నీల్ మార్క్ కనిపిస్తుంది

- కొన్ని చోట్ల కేజీఎఫ్ లా అనిపిస్తుంది. 

- ప్రొడక్షన్ డిజైన్ బావుంది. కాన్సార్ రాజ్యాన్ని సెటప్ చేసిన విధానం కొత్తగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

+ ప్రభాస్ హీరోయిజం (ఎటుచూసిన సైన్యం, తుపాకులు, వార్ ట్యాంకర్సే ఉంటాయి. కానీ ప్రభాస్ కటౌట్ ముందు అవన్నీ చిన్నబోతాయి. ఆ స్థాయిలో ఉంటుంది ప్రభాస్ హీరోయిజం)

+ నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు

+ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్:

- గందరగోళంగా ఖాన్సార్ చరిత్ర

సినిమా రేటింగ్ : 3.5/5

వెబ్ స్టోరీస్