అనుష్క శెట్టికి నిజంగానే ఆ వ్యాధి ఉందా.. అందుకే సినిమాలు చేయట్లేదా..?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||అనుష్క షెట్టి Photo: Instagram||

ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్: ఇండస్ట్రీలో హీరోయిన్స్ సినిమాలు పంచుకున్నట్టు వ్యాధులు కూడా పంచుకుంటున్నారు. నీకు ఆ వ్యాధి ఉందా.. అయితే నాకు ఈ వ్యాధి ఉంది.. అంటూ రోజుకు ఒకరు సోషల్ మీడియాలో బయటకు వచ్చి తమకున్న వ్యాధుల గురించి చెప్తూ ఆడియన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే సమంత మయోసైటిస్ అనే డీసీజ్ తో బాధ పడుతుందని తెలిసి అభిమానులు చాలా కంగారు పడ్డారు. అంతలోనే పూనమ్ కౌర్ కూడా తనకు అలాంటి వ్యాధి ఉంది అంటూ చెప్పి.. ఆ షాక్ కంటిన్యూ చేసింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తనకు గుండె సమస్య ఉంది అంటూ బాంబు పేల్చింది. 

చాలా సంవత్సరాలుగా ఈ సమస్యతో తాను బాధ పడుతున్నట్టు చెప్పి అభిమానులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది రేణు దేశాయ్. దీనికోసం ప్రత్యేకంగా మెడిసిన్స్ వాడుతున్నట్లు చెప్పింది అలాగే యోగా కూడా చేస్తున్నానని.. త్వరలోనే మళ్లీ మామూలు మనిషి అవుతాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే మిగిలిన హీరోయిన్లకు ఉన్న వ్యాధులతో పోలిస్తే.. అనుష్కకు ఉన్న డిసీస్ చాలా వెరైటీగా ఉంది. ఈమెకు నవ్వుకు సంబంధించిన వ్యాధి ఉంది అని ప్రచారం జరుగుతుంది. 

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోతే రోగం అంటారు. కానీ అనుష్క మాత్రం నవ్వితేనే రోగం అనే వార్తలు వస్తున్నాయి. ఇదేంటి కొత్తగా అనుకోవచ్చు.. కాకపోతే ఏదైనా నవ్వే సందర్భం వస్తే నాన్ స్టాప్ లో 20 నిమిషాల పాటు అనుష్క ఆపకుండా నవ్వుతుందని.. అదే తన సమస్య అని కొన్నిసార్లు సన్నిహితులతో కూడా అనుష్క చెప్పిందని తెలుస్తోంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా ఆ నవ్వును ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుందని.. దానివల్ల షూటింగ్ లో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుందని ఆమె బాధ పడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

అందుకే ఈ మధ్య సినిమాలు కూడా తగ్గించేసింది అని వార్తలు ఎక్కువైపోయాయి. అయితే అనుష్కకు అలాంటి సమస్యలు ఏమీ లేవని.. కేవలం బరువు పెరగడం మాత్రమే ఆమెకున్న అనారోగ్య సమస్య అంటూ ఆమె పిఆర్ వర్గం తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ఆమె అనారోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే అంటూ వాళ్ళు కొట్టి పారేశారు. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం అనుష్క ఒకే సినిమాలో నటిస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అనుష్క నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

వెబ్ స్టోరీస్