కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం: ఉప్పల శ్రీనివాస్ గుప్తా||

(రంగారెడ్డి,ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

కళలను ఆరాధించడం, కళాకారులను ప్రోత్సహించడం, కీర్తి ఆర్ట్స్ అకాడమీ భాగ్యనగరంలో అనేక కార్యక్రమాల నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. బుధవారం  రవీంద్ర భారతి వేదికగా కీర్తి అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మహోత్సవం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాల సందర్భంగా అనేకమంది కళాకారులకు అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తరతరాల నుండి తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను పరంపరగా కొనసాగిస్తూ పాఠ్యాత్య పోకడలను పోతున్న నేటి యువతకు మన సంస్కృతి సాంప్రదాయాలను నాట్యం లాంటి కళలను నేర్చుకుంటున్న వారిని ప్రోత్సహించడం బిందులుమ్మా చేస్తున్న గొప్ప కార్యక్రమం అని కితాబు ఇచ్చారు.

సమాధ్యక్షులు ప్రముఖ సరస్వతీ ఉపాసకులు సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞశర్మ మాట్లాడుతూ ఆర్థికంగా తన వద్ద ఏమీ లేకపోయినా కళలను 10 మందికి తెలిపే విధంగా పదిమందిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలే కాక వీలున్నప్పుడల్లా అనేక సంస్కృతిక కార్యక్రమాల నిర్వహిస్తున్న కీర్తి ఆర్ట్స్ అకాడమీ భాగ్యనగరంలో పలువురి మన్ననలు అందుకుంటుందని అన్నారు. ఇంకా కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వనపర్తి రామదాసు తేజావత్ మెట్రో చీఫ్ ఎడిటర్ మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రద సీఈవో ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. కీర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు బిందు లిమ్మ మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది పెద్దలు వచ్చి చిన్నారులను ఆశీర్వదించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలలో ఏపీజే అబ్దుల్ కలాం అవార్డులు కార్తీక మాసం సందర్భంగా అందజేయడం జరిగిందని నంది, నటరాజ, శివ పార్వతి, ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డులు అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు

వెబ్ స్టోరీస్