వాట్సాప్‌లో లాక్ చాట్ ఫీచర్.. దాని ఉపయోగాలేంటో తెలుసా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, టెక్ న్యూస్: సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నది. యూజర్ల ప్రైవసీని పెంచేందుకు ఎప్పటికప్పుడు అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది. తాజాగా, లాక్ చాట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ఈ లాక్ చాట్ ఫీచర్ ఉపయోగం ఏంటంటే.. యూజర్లు తమ చాట్‌కు లాక్ పెట్టుకోవచ్చు. అంటే.. లాక్ ఓపెన్ చేస్తేనే చాటింగ్‌ చేసుకోవచ్చు. వేరేవాళ్లు ప్రైవేట్ చాట్‌ను ఓపెన్ చేయకుండా ఉండేందుకు వాట్సాప్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిన్ బీటా వెర్షన్లలో పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా మరింత పెరగనుంది. ఈ మేరకు వాబ్‌టా ఇన్ఫో నివేదిక వెల్లడించింది.

అవసరం ఉన్న వ్యక్తి చాట్‌కు లాక్ పెట్టుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. వేరే వాళ్లు చూడాలంటే కచ్చితంగా పాస్‌వర్డ్ కానీ, ఫింగర్‌ప్రింట్ గానీ ఉండాల్సిందే. లాక్ అయిన చాట్‌లలో వీడియోలు, ఫొటోలు ఆటోమేటిక్‌గా ఫోన్‌లో సేవ్ కావు. ఇది వినియోగదారులకు మరింత భద్రత ఇవ్వనుంది. అలా కాదని ఎవరైనా ఓపెన్ చేయాలని చూస్తే ఆ చాట్ మొత్తం డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది.

వెబ్ స్టోరీస్