ఈడీ దెబ్బ అదిరింది.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో దూకుడు.. కేసు నమోదు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ఈడీ కేసు నమోదు||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయ్యింది. ఈ కేసులో కేసు నమోదు చేసింది. పేపర్ లీకేజీ కేసును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేయనుంది. పేపర్ లీక్‌లో హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో ఇప్పటి దాకా అరెస్టయిన 15 మందిని ఈడీ విచారించనుంది. అవసరమైతే టీఎస్‌పీఎస్సీ సభ్యులు, సెక్రటరీని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే లావాదేవీలు జరిపిన బ్యాంకుల్లో అధికారులకు నోటీసులు ఇచ్చింది. ఆ వివరాలు తీసుకురావాలని బ్యాంకులను ఆదేశించింది. పేపర్లు ఎంతమందికి చేరాయి? ఎవరెవరికి ఎంత ముట్టింది?  లావాదేవీల మొత్తం ఎంత? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? హవాలా ద్వారా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది.

వెబ్ స్టోరీస్