Viveka Murder Case | సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||వైఎస్ వివేకానందరెడ్డి (Photo: twitter (File))||

ఈవార్తలు, ఏపీ న్యూస్: వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. అతడికి జూన్ 2 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు తెలంగాణ హైకోర్టు.. 5వ తేదీలోపు గంగిరెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో భాగంగా 2019 మార్చి 28న గంగిరెడ్డి అరెస్టయ్యాడు. ఆ తర్వాత 90 రోజులైనా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్ 27వ తేదీన డీఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఏపీ పోలీసుల దర్యాప్తు సరిగా లేదని, కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకానందరెడ్డి కూతురు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది.

అనంతరం గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరగా, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో సీబీఐ అప్పీల్ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో బెయిల్ రద్దు చేయవచ్చని సుప్రీం పేర్కొన్నది. అనంతరం జరిగిన పరిణామాల వల్ల.. ఆ కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేశారు. ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు.. గంగిరెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఆయన లొంగిపోయారు.

వెబ్ స్టోరీస్