పెళ్లిళ్లలో లైట్లతో జాగ్రత్త.. సిద్దిపేట జిల్లాలో ఘోరం.. వైర్లు తగిలి వరుడు మృతి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

పెళ్లిళ్లు అనగానే లైట్ల వెలుతురు జిగేల్ మనిపించాలి.. డీజేల సౌండ్‌తో మోత మోగాలి.. ఫంక్షన్ హాల్ ఒక రేంజ్‌లో కనిపించాలి.. ఇలా అంగు ఆర్భాటాలకు తక్కువేమీ ఉండదు. ముఖ్యంగా స్టేజీ వెనకాల ఏర్పాటుచేసే డెకోరేషన్, లైటింగ్ అదిరిపోవాలి. అయితే, పండుగ వాతావరణంలో పడి ఏ సమస్యలూ పట్టించుకోం. కాలి దగ్గర వైర్లు కనిపించినా, ఏం కాదులే అని లైట్ తీసుకుంటాం. అయితే, అది ఎంత ప్రమాదమో తెలిపే విషాద ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం వెంకటాపూర్‌లో పెళ్లివారింట తీవ్ర విషాదం నెలకొన్నది. పెళ్లయిన మరుసటి రోజు రిసెప్షన్ కోసం డెకోరేషన్ చేస్తుండగా, ఘోర ప్రమాదం జరిగింది. రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ తీగలు తగిలి వరుడు విద్యుత్తు షాక్‌తో మృతి చెందాడు. వరుడి మృతితో పెళ్లివారింట విషాదం అలుముకుంది.


వెబ్ స్టోరీస్