సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్||


సికింద్రాబాద్ రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిన్న (మార్చి 16) సాయంత్రం 7 గంటల సమయంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని 7,8 వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఎక్కువగా చెలరేగడంతో 5, 6వ అంతస్తులలో కూడా మంటలు మొదలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే కాంప్లెక్స్ లోపల చిక్కుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు 4 గంటలకు పైగా తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనలో 22 వయసు గల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రక్షించేందుకు గాంధీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కు తరలించారు. మంటల తీవ్రత పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నివాసాల్లో ఉన్నవారందిని ఖాళీ చేయించారు. 

ఈ ఘటన జరగడానికి స్వప్నలోక్ కాంప్లెక్స్ యాజమాన్యమే కారణమని ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. కాంప్లెక్స్ లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఈ ఘటన జరగడానికి కారణమయ్యిందని తెలిపారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ యాజమాన్యానికి ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలని చాలాసార్లు హెచ్చరించినప్పటికీ వారు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫైవ్ సేఫ్టీ పెట్టుకున్నప్పటికీను వాటిని లాక్ చేయకుండా ఉంచాలని తెలిపారు. షాపింగ్ ఏరియాలలో, కాంప్లెక్స్ లలో ఫైట్ సేఫ్టీ లాక్ చేయకుండా ఉంచడమే మంచిదన్నారు. అలాగే కాంప్లెక్స్ లలో మెట్ల దారిని లాక్ చేసి ఉన్నట్లయితే 101 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. 

అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన, పలువురు గాయపడటం విచారకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో మృతి చెందిన కుటుంబాలకు గాయపడిన వారికి సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, తమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం చర్యలు చేపట్టేందుకు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు.

వెబ్ స్టోరీస్