టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సిట్ విచారణ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీఎస్‌పీఎస్సీ కార్యాలయం||

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి సొంత మండలంలో సిట్ బృందాలు పర్యటిస్తున్నాయి. మంగళవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో దర్యాప్తు చేపట్టారు. మండలంలో మొత్తం 40 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు గుర్తించిన అధికారులు.. వారి ఇండ్లలో జల్లెడ పడుతున్నారు. అభ్యర్థులను ఒక్కొక్కరిగా పరిజ్ఞానాన్ని పరిశీలిస్తున్నారు. కాగా, ఈ నెల 11న కేసు దర్యాప్తుపై స్టేటస్ కో రిపోర్ట్‌ను కోర్టుకు అందజేయనున్నారు.

అటు.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న ప్రశ్నించారు. దాదాపు 3 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన నుంచి కీలక వాంగ్మూలాన్ని సేకరించారు. కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి నిందితులు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా సేకరించారు అన్న వివరాలను ఆరా తీశారు. కమిషన్‌లో ఉద్యోగుల విధి నిర్వహణ, ప్రశ్నపత్రాల నిర్వహణ, భద్రత తదితర విషయాలపై ఆయన నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది.

వెబ్ స్టోరీస్