సోమవారమే దసరా పండుగ జరుపుకోవాలని పండితులు ఎందుకు చెప్తున్నారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం Photo: Instagram||

గత రెండు, మూడేళ్లుగా పండుగలు ఏ రోజు జరుపుకోవాలి? అన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దసరా పండుగది అదే పరిస్థితి. దసరా పండుగ సోమవారమా? మండళవారమా? ఎప్పుడు జరుపుకోవాలి? అన్న అనుమానం ఇంకా ప్రజల్లో ఉంది. ఈ అనుమానాన్ని పంచాంగ పండితులు తొలగించే ప్రయత్నం చేశారు. దసరా పండుగను 23వ తేదీనే అంటే సోమవారం రోజున జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. దసరా పండుగకు కావాల్సింది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న సమయంలోనే శమీ పూజ చేయాలి. ఈ నక్షత్రమే శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైంది. ఈ నక్షత్రం 22వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3:35 గంటలకు ప్రారంభమై, సోమవారం మధ్యాహ్నం 3:35 గంటల వరకు ఉంటుంది.

అయితే మంగళవారం ధనిష్ట నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రం దసరా పండుగకు విరుద్ధం అని పండితులు స్పష్టం చేస్తున్నారు. ‘సోమవారం అపరాహ్ణ ముహూర్తంలో దశమి పగలు 2:29 గంటల వరకు ఉంటుంది. అపరాహ్ణ కాలము పగలు 1:00 గంటల నుండి మ 3:28 వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి (దసరా) అవుతుంది. కాబట్టి సోమవారం రోజునే దసరా పండుగ జరుపుకోవాలి’ అని వివరిస్తున్నారు. శృంగేరీ పీఠంలోనూ శమీ పూజ సోమవారమే నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాల్లోనూ 23వ తేదీనే దసరా పండుగను జరుపుతున్నారు. కాబట్టి ప్రజలు 23వ తేదీనే దసరా పండుగను, శమీ పూజను నిర్వహిస్తే శ్రేయస్కరం.

వెబ్ స్టోరీస్