ధనుర్మాసం ఎంతో శ్రేష్ఠం.. ఈ మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాల భోగం అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు (సంక్రాంతి ముందు రోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాలను పండుగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడుతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (ఆండాళ్) మార్గాలి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుష్ శంకరమన రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

ఎంతో పునీత మాసం

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం అనగా దేనికొరకు ప్రార్ధించడం అనే అర్థం. దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాలలో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి అంటే ఆండాలు పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెబుతారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బిలో పత్రాలను ఉపయోగిస్తారు శయన భ్రంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే ఒక సాంప్రదాయం.

ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు?

రవి ధను రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనస్సులో మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతి లో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండుగ వాతావరణంతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయడం శుభం.

గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?

ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యప్పిండి పసుపు కుంకుమపులతో అలంకరించి పూజిస్తారు లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించడం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

క్రెడిట్: అక్కినేపల్లి పురుషోత్తమరావు

వెబ్ స్టోరీస్