Motivation | రంగ స్థలంపై నవరసాలు ఒలికించటంలో ఘనుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



QQ1

||రంగ స్థలంపై నవరసాలు ఒలికించటంలో ఘనుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య||

ఇంటర్వ్యూ: అక్కినేపల్లి పురుషోత్తమరావు (ఈవార్తలు ప్రతినిధి)

తెర మరగవుతున్న నాటక రంగానికి ఊపిరి పోస్తున్నాడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మఠంపల్లికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారులు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ డాక్టర్ గుంటి పిచ్చయ్య. అల్లూరి సీతారామరాజు పాత్రలో బాల నటుడిగా రంగస్థలం ప్రవేశం చేసి వర్తమాన నటుడిగా ఎదిగిన పిచ్చయ్య ఒకవైపు విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూనే కళా రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో 22 ఆగస్టు 1970 వ సంవత్సరంలో ధనమ్మ సత్యనారాయణ పుణ్య దంపతులకు జన్మించిన గుంటి పిచ్చయ్య.. ప్రాథమిక విద్యాభ్యాస దశలోనే పల్లె కళలను ఆకళింపు చేసుకొని పాఠశాల కళాశాల స్థాయిలో కళా రంగ సేవలో తరిస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. పుణ్యక్షేత్రాలలో భక్తి ముక్తి ఎలా వెల్లి విరుస్తాయో, కురుక్షేత్రంలో శక్తి యుక్తులు ఎట్లా ముఖ్యమో, కళాక్షేత్రంలో నవరసాలు ముఖ్యమైన నమ్ముతారు డాక్టర్ గుంటి పిచ్చయ్య. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి చరిత్రలో బాల నటుడిగా అరంగేట్రం చేసి"రక్త పిపాసి". నాటకంలో సైతాను పాత్రలో నిప్పులు కురిపించి "కన్నీటి కడలిలో"బీద తండ్రి పాత్రలో ప్రేక్షకులకు కంటతడి పెట్టించి "బాలచంద్రుని" పాత్రలో చల్లని వెన్నెలలో కురిపించిన కళామూర్తి డాక్టర్ గుంటి పిచ్చయ్య. కళ అనే దానిని పుట్టుకతోనే వరంగా పొంది ఉన్న కళకు మరింత సాన పెట్టి సాధన చేసి నవరసాలు ఒలికించడమే జీవితం అని నమ్ముతాడు ఈ కళపిపాసి. విప్లవ మూర్తి అల్లూరి సీతారామరాజు పాత్రలు బ్రిటిష్ వారి గుండెల్లో తూటాలు పేల్చే డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడి వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

కళా సమితి ఆధ్వర్యంలో ఉచిత ప్రదర్శనలు

డాక్టర్ గుంటి పిచ్చయ్య యువభారతి సాహిత్య సంస్కృతిక కళా సమితి ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉచితంగా ప్రదర్శనలు ఇస్తూ సమాజంలో మార్పుకు తన వంతు కృషి చేస్తున్నారు. నటుడిగా గుంటి పిచ్చయ్య అనేక నాటకాలు ప్రదర్శించి "శభాష్" అనిపించుకున్నారు."చికాగో అతిధి గారు" "స్వాగతం" "వెలుగు చూసిన కళ్ళు" "ఇక్కడ గుండెలు మార్చబడును" "మంచం మీద మనిషి"ఇలా తొమ్మిది సాంఘిక నాటకాలను వందల ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, పల్నాటి యుద్ధం, బాలనాగమ్మ, సత్య హరిచంద్ర, శ్రీకృష్ణరాయబారం లాంటి పలు పౌరాణిక నాటకాలతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. హైదరాబాదు నగరం తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ,ఏలూరు, కాకినాడ ,నెల్లూరు, ఇలా తెలుగు రాష్ట్రాలలో నలుమూలల అటు సాంఘిక ఇటు పౌరాణిక నాటకాలే కాక జానపద ప్రదర్శనలతో పాటు అనేక వేదికల పైన ఏకపాత్ర అభినయాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 1999వ సంవత్సరంలో యువ భారతీయ సంస్కృతిక కళా సమితిని ఏర్పాటు చేసి అనేకమంది కళాకారులను రంగస్థలంకి పరిచయం చేయడం తెలుగు కళామతల్లికి సేవ చేయడం లాంటిదని అంటారు డాక్టర్ గుంటి పిచ్చయ్య.

రంగస్థలంపై పోషించిన పాత్రలు ఎన్నో

డాక్టర్ గుంటి పిచ్చయ్య ఒక రంగస్థలం కళాకారుడిగా పౌరాణిక, సాంఘిక ,జానపద, ఏకపాత్ర అభినయాల, చిట్టా చాలా ఉంది. అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం సుమారు 50 సార్లు బాలచంద్రుని పాత్ర 20 సార్లు వీరపాండ్య కట్ట బ్రహ్మన 20సార్లు ఏకల విడి పాత్ర ఏడుసార్లు అశ్వద్ధామ పాత్ర ఐదుసార్లు చాణిక్య పాత్ర 5 సార్లు చంద్రగుప్త ఐదుసార్లు సూర్యం నిరుద్యోగి మూడుసార్లు దానకర్ణుడు ఐదుసార్లు దుర్యోధనుడు పదిసార్లు రావణబ్రహ్మ ఐదుసార్లు ఘటోత్కచుడు రెండుసార్లు మైరావనం రెండుసార్లు భీముడు రెండుసార్లు మాయల ఫకీరు 20 సార్లు ధృతరాష్ట్రుడు రెండుసార్లు శ్రీకృష్ణదేవరాయలుగా రెండుసార్లు వెంకటేశ్వర స్వామి గారు రెండుసార్లు ఇలా అనేక పాత్రలు తను పోషించి నా పాత్రలుగా చెప్పుకుంటూ వచ్చారు డాక్టర్ పిచ్చయ్య.

కళా రంగ ప్రదర్శనలు

పౌరాణిక నాటక ప్రదర్శనలు 20 నాటకాలు 30 ప్రదర్శనలు పౌరాణిక ఏకాంక ప్రదర్శనలు 8 ఏకాంక సీనులు, 11 ప్రదర్శనలు సాంఘిక నాటక ప్రదర్శనలు 89 నాటకాలు 116 ప్రదర్శనలు సాంఘిక నాటిక ప్రదర్శనలు 22 నాటికలు 24 ప్రదర్శనలు జానపద నాటక ప్రదర్శనలు 9 నాటికలు తొమ్మిది ప్రజలు చారిత్రక నాటక ప్రదర్శనలు నాలుగు నాటకాలు 12 ప్రదర్శనలు ఏకపాత్ర అభినయాలు 23 అభినయాలు 189, 400 పైచిలుకు నృత్య ప్రదర్శనలకు డాక్టర్ గుంటి పిచ్చయ్య నేతృత్వం వహించి దర్శకత్వం వహించారు.

చలనచిత్ర నటుడిగా

డాక్టర్ గుంటి పిచ్చయ్య "సర్దార్ పాపన్న" "బతుకమ్మ"చిత్రాలలో నటించి తెలుగు వెండితెరపై తన సినీ నట జీవితానికి అంకురార్పణ చేశారు హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ఉత్తమ కళాకారుడిగా అప్పుడు జిహెచ్ఎంసి మేయర్ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు.

QQ1

||సన్మానం అందుకుంటున్న గుంటి పిచ్చయ్య||

గౌరవ డాక్టరేట్

చిన్నతనం నుండి కళా రంగంపై ఆసక్తి పెంచుకొని అనేక సాంఘిక చారిత్రక పౌరాణిక జానపద ఏకపాత్ర అభినయాలతో పాటు రాష్ట్రాన్ని కోవిడ్ 19 అతలాకుతలం చేసిన నేపథ్యంలో కళాకారులకు చేయూతనిచ్చి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం ప్రశంసలు అందించి కళా రంగానికి విశిష్ట సేవ చేయడంతో పాటు సామాజిక సేవ శ్రీయుభారతి సాహితీ సంస్కృతిక కళాశాల ఏర్పాటు చేసి ప్రదర్శనలతో సేవా రంగంతో కూడిన వివరాల పత్రాలను ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫీస్ యూనివర్సిటీకి పంపించగా ఆ యూనివర్సిటీ వారు 26 సెప్టెంబర్ 2020 నాడు ప్రముఖుల సమక్షంలో మైసూర్ లో గౌరవ డాక్టరేట్ అందించి ఘనంగా సత్కరించారు.

డాక్టర్ గుంటి పిచ్చయ్య కళాసేవకు పలువురి ప్రశంసలు

డాక్టర్ గుంటి పిచ్చయ్య రంగస్థలం నాటక రంగాలకు చేస్తున్న సేవలను గుర్తించి సినీ కవి రచయిత డాక్టర్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) ఏవీఎస్, గుండు హనుమంతరావు, నేరెళ్ల వేణుమాధవ్, తుర్లపాటి కుటుంబరావు, వై గోపాల్ రావు, సంగీత దర్శకులు సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ దర్శకులు ఎన్ శంకర్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సినీ నటులు రచయిత గొల్లపూడి మారుతీ రావు, ప్రముఖ సినీ నటులు చంద్రమోహన్, రాళ్లపల్లి, మిమిక్రీ నటులు శివారెడ్డిలు ప్రశంసల వర్షం కురిపించారు. తన విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖలోని సూర్యాపేట జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ సతీష్ పాల్ రాజు, డి,ఈ. శ్రీనివాస్, ఏ డి ఈ వినోద్ కుమార్ ఏ ఈ రాంప్రసాద్ యూనియన్ నాయకులు కరెంట్ రావు రమేష్ బాబు మధుసూదన్ రావు లాంటి తోటి కార్మికుల ప్రశంసలు ఏనాటికి మరిచిపోను అంటారు డాక్టర్ గుంటి పిచ్చయ్య.

వచ్చి చేరిన అవార్డులు రివార్డులు ఎన్నో

డాక్టర్ గుంటి పిచ్చయ్యను గౌరవ డాక్టరేట్ వరించడమే కాక 24 గంటల్లో నృత్య ప్రదర్శనకు దర్శకత్వం వహించినందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నై వారు లింకా బుక్ ఆఫ్ రికార్డులో ఆయన పేరు నమోదు చేయగా 1,500 ప్రదర్శనలు పూర్తి చేసిన నేపథ్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో ఆయన పేరు నమోదు అయ్యింది. రైతు సమస్యల నేపథ్యంలో నిర్వహించిన ప్రదర్శనకు గాను తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు ప్రశంసలు, 1001 నృత్య ప్రదర్శనలకు దర్శకత్వం వహించినందుకుగాను మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ఆయన సొంతం అయ్యింది అదేవిధంగా ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ రికార్డ్ కళారంగానికి విశేష సేవలు అందించినందుకు గాను హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హై యాక్టివ్ బుక్ ఆఫ్ రికార్డు వివిధ ఏకపాత్ర అభినయాల ప్రదర్శనకు గాను బ్రిటిష్ వరల్డ్ రికార్డు ఆయనకు వచ్చి చేరాయి ఇవేకాక అనేకమంది ప్రముఖుల విమర్శకుల ప్రశంసలు వివిధ సంస్థల అవార్డులు ఆయన సొంతం అయ్యాయి. ఈ కళామతల్లి ముద్దుబిడ్డ మరిన్ని అవార్డులు రివార్డులు పొందడమే కాక అనేక వేదికలు పంచుకోవాలని మనము కోరుకుందాం.

వెబ్ స్టోరీస్