త్వరలో ఇందిరమ్మ కమిటీలు.. కమిటీలో సభ్యుడికి 6 వేల జీతం

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ కమిటీలు వేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ కమిటీలో ఉండే సభ్యుడికి రూ.6 వేల వేతనం ఇస్తామని వెల్లడించారు.

revanth reddy
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి (File)

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ కమిటీలు వేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ కమిటీలో ఉండే సభ్యుడికి రూ.6 వేల వేతనం ఇస్తామని వెల్లడించారు. ‘ప్రభుత్వ సంక్షఏమ పథకాలకు అర్హులను గుర్తించేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. కమిటీ సభ్యులు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి’ అని భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో రేవంత్ తెలిపారు.

లోక్ సభ ఎన్నికలు అయిపోగానే  జూన్ మొదటి వారంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు పూర్తయితే మిగతా నాలుగేండ్లు అభివృద్ధిపై దృష్టిపెట్టొచ్చని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్