వాహన చలాన్లపై తెలంగాణ సర్కారు భారీ డిస్కౌంట్.. ఫైన్ ఉంటే ఇలా కట్టేయండి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

తెలంగాణలో వాహనదారులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. బైక్స్‌పై 80 శాతం, కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. వాహనాలపై చలాన్లు ఉంటే డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. ఈ వ్యవధిలో చలాన్లు చెల్లించే వారికి రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. చలాన్లు చెల్లించాలనుకున్నా, వాహనంపై చలాన్లు చూడాలనుకున్నా.. https://echallan.tspolice.gov.in/publicview/ లింక్‌పై నొక్కండి.

కాగా, 2022 మార్చి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలనేందుకు గత ఏడాది ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన రాగా, కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.300 కోట్లు వసూలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం మంది వాహనదారులు చలాన్లు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్‌ భారం పెరిగింది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోసారి రాయితీ ప్రకటిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

వెబ్ స్టోరీస్