Redmi 12C : రెడ్‌మీ 12సీ ఫోన్ విడుదల.. లేటెస్ట్ ఫీచర్ల వివరాలివీ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| రెడ్ మీ 12సీ Photo Credit:www.mi.com ||

ఈవార్తలు, టెక్ న్యూస్ : చైనా Xiaomi బ్రాండ్ కొత్త ఫోన్ Redmi 12C మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. Redmi 12C మూడు స్టోరేజ్ ఆప్షన్లలో, నాలుగు కలర్స్ (షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్) కలర్ ఆప్షన్లతో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో విడుదల కాగా, త్వరలో ఇతర దేశాల్లో విడుదల కానుంది. గ్లోబల్ లాంచ్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. Redmi 10Cకి తర్వాతి మాడల్ Redmi 12Cను భావిస్తున్నారు. 

Redmi 12C price

Redmi 12C బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ చైనాలో CNY 699 (సుమారు రూ. 8,400) నుండి ప్రారంభమవుతుంది. 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 799 (దాదాపు రూ. 9,600), అయితే టాప్-ఎండ్ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 899 (దాదాపు రూ. 10,800).  ఈ బడ్జెట్ ఆఫర్ Redmi 12C అధికారిక వెబ్సైట్ Mi.com ద్వారా కొనుగోలు చేయడానికి కంపెనీ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఆఫర్‌లో పాలికార్బోనేట్ బాడీ, ప్లాస్టిక్ ఫ్రేమ్ నాలుగు (షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్) కలర్స్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

Redmi 12C specifications

డ్యూయల్ సిమ్, డిస్ప్లే 6.71-అంగుళాల, Redmi 12C 6.71-అంగుళాల HD+ (1650x720 పిక్సెల్‌లు) రిజల్యూషన్ డిస్‌ప్లేతో 20:6:9 యాస్పెక్ట్ రేషియో, 500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Helio G85, డ్యూయల్-కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది, ఫ్రంట్ కెమెరా 5-మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా 50-మెగాపిక్సెల్, దీనిలో LED ఫ్లాష్‌తో పాటు పిల్-ఆకారపు సింగిల్ కెమెరా, RAM 4GB, 6GB,స్టోరేజ్ 64GB,128GB, Redmi 12Cలో స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా మూడు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో 512GB వరకు పొడిగించవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 5000mAh, ఛార్జ్ చేయడానికి మైక్రో-USB పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. Redmi 12C 10W ఛార్జింగ్ అడాప్టర్‌తో ఛార్జ్ చేయబడుతుంది. OS ఆండ్రాయిడ్ 12, రిజల్యూషన్ 720x1650 పిక్సెల్స్, 3.5mm హెడ్‌ఫోన్ స్లాట్‌ ఉంది.

వెబ్ స్టోరీస్