Health tips | ఇంట్లో దొరికే ఈ పిండి వలన అందమైన ముఖం మీ సొంతం..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


ఈవార్తలు ; ముఖాన్ని అందంగా అలంకరించుకోవడం అంటే మగువలకు ఎంతో ఇష్టం. ముఖానికి ఎలాంటి మచ్చలు, పింపుల్స్ లేకుండా అందంగా ఉంచుకునేందుకు మార్కెట్లో దొరికే ఎన్నో క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, లోషన్లు వాడుతూ ఉంటారు. కానీ, వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వినియోగించినన్ని రోజులే వీటితో ఫలితం ఉంటుంది. అయితే ఇంటిలో దొరికే పదార్థాలతో ముఖాన్ని అందంగా మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉండటమే కాకుండా అందంగా కనిపించవచ్చు. అందులో బియ్యం పిండితో చర్మాన్ని సురక్షితంగా అందంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

ఇంట్లో దొరికే బియ్యప్పిండి లో రకాలైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని మంచిగా మిక్స్ చేసి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరే వరకు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా చేయడం వల్ల మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. 

ఒక గిన్నెలో చిటికెడు బేకింగ్ సోడా, టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టేబుల్ స్పూన్ తేనె తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తూ సున్నితంగా స్క్రబ్ చేయాలి ఇలా స్క్రబ్ చేసి ఆరే వరకు వదిలేయాలి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే డెడ్ స్కిన్ తొలిగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

ఒక గిన్నెలో ఒక అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అర టేబుల్ స్పూన్ ఆముదము నూనెను తీసుకుని బాగా మిక్స్ చేయాలి. మిశ్రమాన్ని బ్లాక్ స్పోర్ట్స్, కళ్ళ కింద నల్లటి చేరాలను, మోచేతి మోకాలు ప్రాంతాలలో అప్లై చేయడం వలన చర్మం నిగారింపుగా మారుతుంది. 

ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి నీ ఒక గిన్నెలో తీసుకొని అందులో కొన్ని పచ్చి పాలను పోస్తూ మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకోవడం వలన ముఖంపై ఉన్న టాన్ తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది.

వెబ్ స్టోరీస్