పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారా.. ఎంత డేంజర్ అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారా? ఫోన్ ఇస్తేనే అన్నం తింటామని మారాం చేస్తున్నారా? అయినా, సరే ఫోన్ మాత్రం ఇవ్వొద్దు. ఎందుకంటే ఈ వార్త చదివిన తర్వాత మీకే తెలుస్తుంది. గంటల కొద్దీ ఫోన్లు వాడే పిల్లలు మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారని తాజా అధ్యయనం తెలిపింది. పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి, తీవ్ర ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించింది. ప్రముఖ సర్వే సంస్థ లోకల్స్ సర్కిల్స్ సర్వే నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఇదే సమస్యతో బాధపడుతున్నారట.

9-17 ఏళ్లు ఉండే పిల్లలపై సర్వే చేయగా, ప్రతి 10 మందిలో ఆరుగురు ప్రతి రోజు 3 గంటలకు పైగా గేమింగ్ సైట్లు, సోషల్ మీడియాతో గడుపుతున్నారు. దీనివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు పిల్లలకు ఫోన్లు కాకుండా, శారీరక వ్యాయామం చేసే పనులు చెప్పాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు మానసికంగా ధృడంగా ఉండాలంటే వారిని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేయాలని స్పష్టం చేస్తున్నారు.


వెబ్ స్టోరీస్