Health Tips | పాదాలపై పగుళ్లు ఏర్పడుతున్నాయా.. మృదువుగా మార్చే టిప్స్ మీకోసం..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

మీ స్కిన్ డ్రైగా మారి పాదాలు పగుళ్లు ఏర్పడుతున్నాయా.. చూడడానికి కూడా అసహ్యంగా కనిపిస్తుందా.. ఇలా కాళ్లు పగలడం వల్ల పాదాలకు నొప్పి ఏర్పడి ఒక్కొక్క సమయంలో రక్తం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే పాదాలను మృదువుగా ఉంచేందుకు టిప్స్ ఏంటో తెలుసుకుందాం.. 

నిమ్మరసం ఉప్పుతో స్క్రబ్ : 

ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకొని నిమ్మకాయ తొక్కలను ఉప్పును వేసి పాదాలను ఉంచాలి. పది నిమిషాల తర్వాత నిమ్మకాయ తొక్కులతో పాదాలను స్క్రబ్ చేస్తే పాదాలలో ఉన్న మురికి ఇన్ఫెక్షన్లు తొలగిపోయి అందంగా కనబడతాయి. 

రోజ్ వాటర్, గ్లిజరిన్ : 

ఒక గిన్నెలో రోజు వాటర్, గ్లిజరిన్ తీసుకొని రెండింటిని మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు పాదాలకు అప్లై చేసి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు బృదువుగా మారతాయి. 

నూనె : 

మార్కెట్లో లభించే ఏ రకమైన నూనె అయినా కొంచెం తీసుకొని రాత్రి పడుకునే ముందు పాదాలకు మధ్యన చేసి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా చేయడం వల్ల పగుళ్ల లోపలికి నూనె వెళ్లి పగుళ్లను మాయం చేసి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. 

వ్యాసిలిన్ : 

రాత్రి పడుకునే ముందు కొంచెం వ్యాసిలిన్ తీసుకొని పాదాలకు అప్లై చేసి సాక్సులు వేసుకొని పడుకోవాలి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయడం వల్ల పాదాలు అందంగా మారుతాయి. 

పాలు మరియు తేనె : 

ఒక గిన్నెలో పాలు, తేనె తీసుకొని బాగా మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయాలి. మొదటిసారి అప్లై చేసి 15 నిమిషాలు ఆగిన తర్వాత రెండవసారి అప్లై చేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మృదువుగా మారి మాయిశ్చరైజింగ్ అందుతుంది అలాగే టాన్ కూడా తొలగిపోతుంది. 

బియ్యం పిండి మరియు తేనె : 

ఒక గిన్నెలో బియ్యం పిండి మరియు తేనె తీసుకుని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన పాదాలకు మాయిశ్చరైజింగ్ స్కిన్ తొలగిపోతుంది. 

వేపాకు పేస్ట్ : 

వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల పాదాలలో బ్యాక్టీరియా, ఫంగస్ తొలగిపోతుంది. పాదాల పగుళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది. 

ఆముదము నూనె : 

ఆముదము నూనెను తీసుకొని పాదాలకు 15 నిమిషాల పాటు మర్దన చేస్తూ ఉండాలి ఇలా మర్దన చేసిన పాదాలను రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం వేడి నీటిలో పది నిమిషాలు పాదాలను ఉంచి ఆ తర్వాత స్టోన్ తో స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల బ్రెడ్ స్కిన్ తొలగిపోయి ముదువుగా మారుతాయి.

వెబ్ స్టోరీస్