పులిపిర్లతో కలిగే నష్టాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

అందమైన ముఖం పైన పులిపిర్లు ఉంటే ఏదో ఇబ్బందికరంగా మారిపోతుంది. ముఖం పైనే కాకుండా మెడ చేతులు పాదాలపై పులిపిర్లు వస్తుంటాయి వీటివల్ల కొన్ని చర్మం లో కలిసిపోయిన మరికొన్నింటి వలన మంట పుట్టడం దురద రావటం వంటివి కలుగుతాయి. చేతివేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. పులిపిర్ల వలన కలిగే నష్టాలను వాటిని తొలగించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.. 


పులిపిర్ల వలన కలిగే నష్టాలు : 

పులిపిర్లు వైరస్ వలన వస్తాయి. ఇది ఒక రకమైన చర్మ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. ‘హ్యూమన్ పాపిలోమా’ అనే వైరస్ వలన మొటిమలు వచ్చినప్పుడు శరీరంలోకి ప్రవేశించి అక్కడ పులిపిరిలా తయారవుతుంది. వీటిని వాట్స్ అని పిలుస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పులిపీర్లు అనేవి ఒక అంటూ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. ఎప్పుడు చేతితో గిల్లకూడదు. అయితే వీటిని నివారించుకునేందుకు ఏం చేయాలి. పులిపిర్లు ఉన్నవానికి సామాజిక దూరం పాటించడం మంచిది. 


పులిపిర్లు నివారించేందుకు చిట్కాలు :

మేడిపండు చెట్టు యొక్క పాలను తీసి పులిపిర్లకు రాయాలి ఇలా రాయడం వల్ల ఆ పాలలోని విటమిను వైరస్ ని నాశనం చేస్తుంది. దీంతో పులిపిర్లతో సహా వైరస్ కూడా నయం అవుతుంది. 

కలబంద లో ఉండే మేనిక్ ఆసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్ తగ్గేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉండే చిగురు పదార్థాన్ని పులిపిర్ల మీద రాయాలి ఇలా రాయడం వలన ఇన్ఫెక్షన్ తొలగిపోయి పులిపిర్లు తగ్గిపోతాయి. 

వెల్లుల్లి ని తీసుకొని పులిపిరి ఉన్నచోట వెల్లుల్లి రసాన్ని పెట్టాలి. పెళ్లిళ్లు ఉండే ఎల్లిసిన్ ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది.

చర్మం పొడి బారకుండా చూసుకోవాలి. పొడి చర్మం కలవారికే పులిపిర్లు వచ్చే అవకాశం ఎక్కువ. 

డెర్మటాలజిస్టు దగ్గరికి వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకొని పులిపిర్లను తీసి వేసుకోవడం మంచిది.

వెబ్ స్టోరీస్