పిల్లల కడుపులో నులిపురుగులా.. వాటిని తగ్గించే మార్గాలివే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


చాలామంది పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాకుండా తల్లులు బాధపడుతూ ఉంటారు.. పిల్లలు, పెద్దలలో కడుపునొప్పి, వాంతులు, వికారం, జ్వరం, తుమ్ములు వంటి సమస్యలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే పిల్లల్లో మాత్రం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తీయటి పదార్థాలు, రెండు పదార్థాలను ఒకటేసారి కలిపి తినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటో అంటే నులిపురుగులు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలలో నులిపురుగు లక్షణాలు ఏర్పడటం వలన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, కడుపు నొప్పితో ఇబ్బంది పడటం, ఎదుగుదల ఉండకపోవడం వంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే నులిపురుగులను తగ్గించుకునే మార్గాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక గిన్నెలో చెరుకు రసాన్ని తీసుకొని అందులో 25 గ్రాముల శనగలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున పిల్లలకు తినిపించడం వలన నులిపురుగులు బయటకు విసర్జింపబడతాయి. అయితే ఈ రెమెడీ వాడిన తర్వాత 5 గంటల వరకు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు.

నారింజకాయ తొక్కను తీసి పొడిలాగా చేసుకునేందుకు వీలుగా ఉండేలా ఎండలో ఎండబెట్టి తర్వాత దీనిని ఒక మిక్సీలో వేసి పొడి చేయాలి. ఈ పొడిని ఒక గ్లాస్ నీటిని తీసుకొని గోరువెచ్చగా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వేసి ఉదయాన్నే పిల్లలకు తాగించాలి. ఇలా మూడు రోజుల పాటు చేస్తే పిల్లలలో నులిపురుగులు నశిస్తాయి.

ముల్లంగిని రసంలా చేసి అందులో కొంచెం ఉప్పు వేసి నాలుగు రోజుల పాటు ఉదయం సాయంత్రం పిల్లలకు ఇస్తూ ఉంటే పొట్టలో ఉండే నులిపురుగులు చనిపోతాయి. 

పిల్లలకు నులిపురుగుల సమస్య నుండి త్వరగా బయటపడాలంటే సొంటి తేనెను కలిపి ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన నులిపురుగులు చనిపోతాయి. ఈ పద్ధతి తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు నులిపురుగుల సమస్య బారిన పడకుండా అవకాశం ఉంటుంది.

వెబ్ స్టోరీస్