ఈ ఎండాకాలంలో కీర దోస లాభాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


ఎండాకాలం వచ్చిందంటే చాలు భానుడి కాంతికి శరీరం డిహైడ్రేట్ అవుతుంది. చల్లగా ఉండే పదార్థాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్స్, మజ్జిక, ఫ్రూట్ జ్యూసులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన నీటి శాతం అందుతుంది. అందులో పుచ్చకాయ, కీరదోసలో 96 శాతం నీరు శరీరానికి రక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక తక్కువ ధరలో శరీరానికి ఉపయోగపడే కీరదోస వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోస తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.. 

కీరదోస తినడం వల్ల కలిగే లాభాలు : 

క్షీరదోస ఎప్పుడు తోక్కతో తిన్నమే మంచిది.  కీరదోసలో ఎన్నో శరీరానికి కావాల్సిన పోషక లక్షణాలు అధికంగా లభిస్తాయి. వేసవికాలంలో శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఎండవలన చర్మం కందిపోకుండా ఉండేందుకు రక్షణ ఇస్తుంది. అలాగే చర్మాన్ని తాజాగా ఉంచడంలో తోడ్పడతాయి. కాలిన గాయాలు, మొటిమల తొలగిపోవడానికి తోడ్పడతాయి. మలబద్ధకంతో బాధపడే వారికి కీరదోస మంచిగా ఔషధం. కీరదోస తినడం వల్ల క్యాన్సర్ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. శరీరంలో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కీరదోస ఉపయోగపడుతుంది. కడుపు నొప్పితో బాధపడే వారికి కీరదోస తినడం వల్ల కడుపులో ఏమైనా విషపూరిత వ్యర్ధాలు ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కీరదోస జ్యూస్ తాగడం వలన శరీరాన్ని డిహైగ్రేట్ నుండి త్వరగా కాపాడుకోవచ్చు. రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి కీరదోస ఉపయోగపడుతుంది. కీరదోస శరీరానికే కాకుండా చర్మ రక్షణలో కూడా ఉపయోగపడుతుంది. కంటి కింద నలుపు పోవడానికి లేదా కళ్ళు ఉబ్బినప్పుడు కీరదోసను కళ్ళపై పెడితే మంచి ఫలితం ఉంటుంది. జుట్టును ఒత్తుగా అందంగా పెంచేందుకు కూడా కీరదోస ఉపయోగపడుతుంది. కీరదోస జూస్ తాగడం వలన ఉత్తర పిండాల్లోని రాళ్లు కరిగి పోతాయి. ఎండాకాలం కారణంగా మూత్ర విసర్జనలో ఎలాంటి ఇబ్బందులైన ఉంటే కీరదోస వలన మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

వెబ్ స్టోరీస్