కర్పూరం ఉపయోగాలు తెలిస్తే నోరెళ్ళబెడతారు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


మనం నిత్యం పూజ గదిలో ఉపయోగించే కర్పూరం ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది. కర్పూరంలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది దేవుడి ముందు నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి ఎంత ఉపయోగపడుతుందో మన శరీరంలో అనారోగ్యాన్ని తగ్గించడానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే పూజ గదిలో ఉపయోగించే మంచి కర్పూరం వలన ఎలాంటి ఆరోగ్య పలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.. 

కర్పూరంలో నెయ్యి వేసి దాన్ని పేస్టులా తయారుచేసి తగిలిన గాయాలపై రాస్తే రక్తస్రావం తగ్గుతుంది. అలాగే గాయాలు నుండి చీము రాకుండా, ఇన్ఫెక్షన్లు సోకకుండా త్వరగా తగ్గిపోవడానికి ఇది మంచి రెమిడీ. 

ఎప్పుడు తలనొప్పితో బాధపడే వారికి కాపురం ఒక మంచి రెమెడీ. కర్పూరం నెయ్యిని తయారుచేసి తల భాగంలోని కణతలకు రాసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో వాపు ఉన్నచోట కర్పూరం, నెయ్యి పేస్టు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

కర్పూర తైలాన్ని కొద్దిగా నీటిలో వేసి చర్మం ఎర్రబడిన చోట లేదా దద్దులు వచ్చిన చోట, చర్మం కాలిన చోట మంట పుడుతూ ఉంటే ఈ కర్పూర తైలాన్ని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

నిద్ర సమస్యతో బాధపడే వారికి రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కర్పూర తైలాన్ని దిండుకు చల్లినట్లయితే ఆ కర్పూర తైల వాసన వలన చక్కగా నిద్ర పడుతుంది. 

తరచుగా జలుబు, జ్వరం వస్తూ ఉంటే కర్పూరం, నెయ్యిలో కలిపి తలభాగానికి, గొంతు లో రాస్తూ ఉంటే జలుబు జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది.

మాడు రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే నిత్యం తలకు రాసుకుని నూనెలో కొద్దిగా మంచి కర్పూరం వేసి మాడుకు పట్టిస్తూ ఉంటే మాడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే జుట్టు కూడా బలంగా పెరుగుతుంది. 

పేలు పోవడానికి కర్పూర తైలం ఒక మంచి ఔషధం తలస్నానం చేసే ముందు కర్పూర తైలంతో మర్దన చేసి తర్వాత తల స్నానం చేసినట్లయితే తలలో పేలు మాయమవుతాయి.

వెబ్ స్టోరీస్