Honey Benefits | తేనె గొప్పదనం ఏంటో తెలుసా.. మన పెద్దోళ్లు ఏం చెప్తున్నారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, హెల్త్ న్యూస్: ప్రకృతి సిద్ధంగా దొరికే తేనే వలన శరీరానికి మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు తేనె ఉపయోగపడుతుంది. తేనె ఆరోగ్యానికి, అందానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా తేనె వలన చాలా లాభాలు ఉన్నాయి. అంటు వ్యాధులు నీరసం నోటి దుర్వాసన ఇలా వివిధ రకాలైన వ్యాధులను నివారించే శక్తి తేనెల ఉంది. ఈ తేనె వలన ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చు తెలుసుకుందాం..

పిల్లలకు తేనె యొక్క ఉపయోగాలు : 

ఒక పావు గ్లాసు మంచినీటిలో పావు చెంచా తేనే తీసుకొని  నీటిలో మిక్స్ చేసి రోజు పరగడుపున పిల్లలకు తాగించడం వలన పొట్టలోని వ్యాధులు అన్ని నివారింపబడతాయి. 

యజ్ఞంలో తేనెను ఎందుకు వాడతారు : 

అంటు వ్యాధులు ఇంటికి దరిచేరకుండా నిప్పుల మీద తేనె మైనమును వేసి ఇల్లు చుట్టూ పొగ చూపించడం వలన ఇంట్లోకి అంటు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. అంటు వ్యాధులు ఉన్న తొలగిపోతాయి. 

కాళ్ల పగుళ్ల సమస్య తేనెతో చెక్ : 

50 గ్రాముల తేనె మైనాన్ని తీసుకొని స్టవ్ పై ఒక గిన్నెలో చిన్న మంట మీద మరిగించి అందులో వెన్నపూస కలిపి వేడి చేస్తూ ఉంటే ఈ రెండు మిశ్రమాలు ఒక పేస్టులా మారుతాయి ఈ పేస్టును రోజు పడుకునే ముందు కాళ్లకు రాసుకోవడం వలన కాళ్లు మృదువుగా మారి పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. 

గడ్డలు మరియు గవదబిళ్ళలకు తేనె ఉపయోగం : 

తినే సున్నం మరియు తేనెను సమానంగా తీసుకుని గడ్డలు లేదా గవ్వదబిళ్ళలు ఉన్న ప్రాంతంలో పలుచని వస్త్రంతో మసాజ్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా కరిగిపోతూ ఉంటాయి. 

కంటి చూపు మెరుగుపడాలంటే : 

తేనె, నీరుల్లి రసాన్ని సమానంగా తీసుకొని రాత్రి పడుకునే సమయంలో కంటిలో రెండు చుక్కలు వేసుకుంటే కంటి దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుంది.

నీరసం నుండి బయట పడేందుకు తేనె : 

ఒక గ్లాసులో సగం నీరు తీసుకొని అందులో 30 గ్రాముల తేనెలు కలిపి రోజు ఉదయం, సాయంత్రం తాగుతూ ఉంటే శరీరంలో నీరసం తగ్గి మంచి శక్తి వస్తుంది. 

దగ్గుతో బాధపడుతున్న వారికి తేనె..

ఒక గ్లాసులో 6 గ్రాముల అల్లం రసం మూడు గ్రాముల తేనెను కలిపి రోజు ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. 

నోటి నుండి వచ్చే దుర్వాసన : 

10 గ్రాముల తేనెను తీసుకొని పావు లీటర్ నీళ్లలో బాగా కలిపి రోజు మూడు పూటలా పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. 

వికారంగా ఉన్నప్పుడు తేనే.. 

20 గ్రాముల తేనెలో, లైట్ గా వేయించిన జీలకర్ర పొడిని మూడు గ్రాములు వేసుకొని రోజుకు నాలుగు సార్లు తాగడం వలన వికారం నుండి, వాంతుల నుండి ఉపశమనం లభిస్తుంది.

వెబ్ స్టోరీస్