వేసవి కాలం వచ్చేసింది.. శరీరాన్ని కాపాడుకొనే చిట్కాలు ఇవిగో..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

వేసవికాలం వచ్చిందంటే చాలు చెమట, టాన్, ఇచ్చింగ్ లతో బాధపడుతూ ఉంటాం. సీజన్ మారుతున్న కొద్ది మన ముఖంలో మార్పులు వస్తుంటాయి.  వేసవికాలంలో మన అందంపై శ్రద్ధ చూపడం ఎంతో అవసరం. ముఖాన్ని శరీరాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి..? లేకపోతే వాటి వల్ల వచ్చే సమస్యలేంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

వేసవిలో వచ్చే టాన్ తొలగించేందుకు రెమెడీస్ : 

తేనె, నిమ్మరసం : 

రెండు స్పూన్ల నిమ్మరసం రెండు స్పూన్ల తేనె ఒక గిన్నెలో తీసుకొని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని టాన్ ఏర్పడిన ప్రాంతంలో అప్లై చేయాలి అప్లై చేశాక 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసం ఫ్యామిలీ రిమూవ్ చేస్తుంది. తేనె చర్మం మాయిశ్చరైజింగ్ కి ఉపయోగపడుతుంది.

గంధం పసుపు

గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గంధం ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని రోజ్ వాటర్ తో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట వరకు అలాగే ఉంచాలి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 

ఎండాకాలంలో వచ్చే సమస్యలు : 

ఎండాకాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా పెరగడంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చెమట రావడం వల్ల చమట వ్యర్ధాలు అలాగే పేరుకుపోయి చమట పొక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుమ్ము ధూళి వల్ల కంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చూపు మందగిస్తుంది రెటీనాపై అధిక ప్రభావం పడుతుంది. సీజన్ మారడం వలన శరీరం పై దద్దులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది ఒకరి నుండి మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చర్మ విషయానికొస్తే చర్మం కందిపోయి టాన్ ఏర్పడుతుంది. డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

ఎండాకాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా ఉండటం వలన పిల్లలను ఇంటి వద్దనే ఉంచి వారికి కథలు, పాటలు, ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ వాళ్ళ సమయాన్ని ఇంటిపట్టునే ఉండేందుకు కేటాయించాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఉదయం, సాయంత్రం స్నానం చేయటం వలన చెమటకు సంబంధించిన వ్యర్ధాలు తొలగిపోయి దద్దుల్లు చెమట పొక్కులు రాకుండా కాపాడుకోవచ్చు. పళ్ళ రసాలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి మసాలాకు సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోవాలి. మెత్తటి కాటన్ దుస్తులు ధరించాలి. బయటికి వెళ్లే అప్పుడు గొడుగు పట్టుకొని వెళ్లడం ఉత్తమం. వీలైతే పచ్చటి పొలాలతో కాలక్షేపం చేయాలి. పల్లెటూరు వాతావరణం ఆస్వాదించాలి.


వెబ్ స్టోరీస్