పిల్లలు సన్నగా ఉన్నారా.. అయితే, ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారం తినిపించాల్సిందే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు శరీరానికి అవసరం. పోషకాల లోపం వల్ల సన్నగా అవ్వడం జరుగుతుంది. చాలామంది సరైన పోషకాలు లేక సన్నబడుతుంటారు. ఇందులో ముఖ్యంగా పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోకుండా సన్నబడుతూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలు బలంగా, యాక్టివ్ గా ఉంటారో తెలుసుకుందాం.. 


గుడ్డు : 

గుడ్డులో  విటమిన్ A, D, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. రోజుకో గుడ్డు ఉడకబెట్టి పిల్లలకి తినిపించడం వలన పిల్లలు బలంగా అవుతారు. 

బ్రౌన్ రైస్: 

బ్రౌన్ రైస్ లో కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు అధికంగా ఉండటం వలన పిల్లలు హెల్తీగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. 

బాదం: 

బాదంలో పోషకాలు అధికంగా ఉండే బాదం పప్పులను రోజూ తినాలి. రోజు రాత్రి కొన్ని బాదంపప్పులను తీసుకుని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బాదంపప్పు తొక్కను తీసి తినడం వలన పిల్లలకు కావలసినన్ని పోషకాలు అందుతాయి. 

కొబ్బరి: 

కొబ్బరి వంటకాలలో రుచికోసం వాడుతుంటాం. అయితే కొబ్బరి నుండి వచ్చే పాలు ఆరోగ్యానికి అందించే విటమిన్స్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. కొబ్బరి పాలు ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు ఆరోగ్యవంతంగా బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 

అరటి : 

అరటిపండు తినడం వలన పిల్లలు మంచిగా బరువు పెరుగుతారు. గ్లాసుడు పాలలో ఒక అరటిపండు వేసి పిల్లలకు తినిపించడం వలన సరైన పోషకాలు శరీరానికి అంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

వెబ్ స్టోరీస్