ధర్నా చౌక్‌కు రండి.. కేసీఆర్ మెడలు వంచుదాం.. తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బీజేపీ నిరుద్యోగ మహాధర్నా||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణలో రాజకీయం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన తర్వాత అధికార, ప్రతిపక్షాలు తమ దాడిని తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ యువతకు కీలక పిలుపు ఇచ్చారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు (శనివారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో మహా ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

‘యువతను వంచిస్తున్న కేసీఆర్ సర్కారు మెడలు వంచుదాం.. మన కొలువులు మనం సాధించుకుందాం’ అని పిలుపునిచ్చారు. ‘మా నౌకరీలు మాగ్గావాలె.. కేబినెట్ నుంచి కేసీఆర్ కొడుకును భర్తరఫ్ చేయాలి. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలి. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అన్న డిమాండ్లతో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్