ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలం బాట.. పర్యటన వివరాలివే.. సాయంత్రం కీలక ప్రకటన?

ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

kcr
కేసీఆర్ Photo:Facebook

ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10:30 గంటలకు కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌కు చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో భోజనం చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్‌పల్లి వంతెనపైకి చేరుకొని మిడ్‌మానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు  ఆయన చేరుకుంటారు.

వెబ్ స్టోరీస్