దక్షిణాది రాష్ట్రాల యువతకు రక్షణ కల్పించండి: కొలను శంకర్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల యువతకు ఇతర రాష్ట్రాలలో రక్షణ లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సింగిల్ విండో చైర్మన్ శంకర్ రెడ్డి అన్నారు.

kolanu shankar reddy
కొలను శంకర్ రెడ్డి

(ఈ-వార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు, రంగారెడ్డి)

దక్షిణాది రాష్ట్రాల యువతకు ఇతర రాష్ట్రాలలో రక్షణ లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సింగిల్ విండో చైర్మన్ శంకర్ రెడ్డి అన్నారు. ఆయన హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయక్ సింగ్ సైనిని కలిసి ఈ విషయం చెప్పినట్లు మా ప్రతినిధికి టెలిఫోన్ ద్వారా తెలిపారు. ఆయన నాయక్ సింగ్ సైనిని కలిసి ఇటీవల తరచుగా దక్షిణాది రాష్ట్రాల యువత ఉపాధి వ్యాపార నిమిత్తం హర్యానాలో నివాసం ఉన్నవారికి అక్కడ సంఘవిద్రోహశక్తుల వేధింపులతో రక్షణ లేకుండా పోతుందని హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయక్ సింగ్ సైనిని కలిసి వినతి పత్రం సమర్పించినట్లు వారికి సమస్యను వివరించినట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాదు వాసులకు వివిధ ప్రాంతాలలో జరిగిన అక్రమ కేసులపై అన్యాయంగా హర్యానా పోలీసులతో జరిగిన వేధింపులతో జైలు జీవితం గడుపుతున్న హైదరాబాద్ వాసులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించడం జరిగింది అని కొలను శంకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి తో పాటు పి కృష్ణ, సతీష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్ స్టోరీస్