తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ పేలింది. కాన్వాయ్‌లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పంక్చర్ అయ్యి పేలింది

revanth reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Photo: Facebook

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ పేలింది. కాన్వాయ్‌లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పంక్చర్ అయ్యి పేలింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాన్వాయ్‌లోని నాయకులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాహనాన్ని పక్కన ఆపి రిపేర్ చేయగా, మిగతా కాన్వాయ్‌తో సీఎం రేవంత్ కొడంగల్‌కు వెళ్లారు.

వెబ్ స్టోరీస్