Tiktok : ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సంచలన నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, టెక్ న్యూస్: స్మార్ట్ ఫోన్ వాడకం ఇదీ అనేలా టిక్‌టాక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పల్లెటూళ్లలో పండు ముసలి తాత దగ్గరి నుంచి పట్నాల్లోని పసి వయసులకూ సుపరిచితమైన పేరు.. టిక్‌టాక్. పనులన్నీ పక్కనబెట్టి టిక్‌టాక్‌లో మునిగిపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే, నేషనల్ సెక్యూరిటీ కారణాలతో దీన్ని భారత ప్రభుత్వం 2020లో నిషేధించింది. అప్పటి నుంచి దేశంలో టిక్‌టాక్ సేవలు నిలిచిపోయాయి. అయితే, ఆ సంస్థలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు మాత్రం ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. వీరు బ్రెజిల్, దుబాయ్ మార్కెట్ల కోసం పనిచేస్తున్నారు. తాజాగా.. ఈ ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ప్రకటించింది.

భారత్‌లో టిక్‌టాక్ నిషేధం తర్వాత తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. ఇప్పుడు అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. దీంతో ఉద్యోగులను సాగనంపేందుకే నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. త‌మ గ్లోబ‌ల్‌, ప్రాంతీయ సేల్స్ టీమ్స్‌కు స‌పోర్ట్ కోసం 2020లో భార‌త్‌లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ స‌పోర్ట్ హ‌బ్‌ను మూసివేయాల‌ని నిర్ణయించామని పేర్కొంది.

వెబ్ స్టోరీస్