Twitter : ట్విట్టర్‌లో మరో కొత్త ఫీచర్.. కానీ షరతులు వర్తిస్తాయి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(Photo: ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, టెక్ న్యూస్: ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన్ ఎలాన్ మస్క్ ఈ సామాజిక మాధ్యమంలో పలు కీలక మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా, మరో కీలక అప్‌డేట్‌ను ట్విట్టర్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. ట్విట్టర్‌లో ఏకంగా 60 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇక్కడే ఒక తిరకాసు పెట్టింది. ఈ అవకాశం కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్లకు మాత్రమేనని స్పష్టం చేసింది. అవి కూడా 1080 రిజొల్యుషన్‌తో వీడియోలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఆ వీడియో 2జీబీకి మించకూడదు. అయితే, ఈ ఫీచర్‌కు ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైతే కేవలం డెస్క్‌టాప్ యూజర్లకే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. 

ఇంతకుముందు యూజర్లు 10 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయటానికి అవకాశం ఉండేది. అది కూడా 512 ఎంబీ సైజుగా ఉండేది. ప్రస్తుతం దాన్ని పెంచుతూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వీడియో క్వాలిటీని కూడా మార్చుకొనే సదుపాయాన్ని యూజర్లకు కల్పించింది. ఇదిలా ఉండగా, బ్లూ టిక్ కోసం భారత్‌లో యాపిల్ యూజర్ల నుంచి ట్విట్టర్ నెలకు రూ.910, వెబ్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు రూ.660 వసూలు చేస్తోంది. ఈ సబ్‌స్రిప్షన్ వల్ల బ్లూ టిక్, ట్వీట్ ఎడిట్ తదితర కొత్త ఫీచర్లు వాడుకోవచ్చు.

వెబ్ స్టోరీస్