Whatsapp : డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్లు ఏవేవంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(Pic: ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, టెక్ న్యూస్: ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కొన్ని ఫోన్ల వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. యాపిల్, శామ్‌సంగ్ సహా పలు బ్రాండ్లకు చెందిన 49 రకాల ఫోన్లలో డిసెంబర్ 31 నుంచి వాట్సాప్ అప్‌డేట్స్ రావని తెలిపింది. అంటే.. ఆయా ఫోన్లలో యాప్ పనిచేయదని అర్థం. వాట్సాప్ పని చేయని ఫోన్లు తక్కువ మోడల్‌వేనని, చాలా మంది వినియోగదారులు వాటిని వాడటం లేదని చైనాకు చెందిన గిజ్ చైనా పేర్కొన్నది.

వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఇవే:

యాపిల్ (Apple) : యాపిల్ ఐఫోన్ 5, యాపిల్ ఐఫోన్ 5సీ

హువాయ్ (Huawei) : ఆసెండ్ డీ, ఆసెండ్ డీ1, ఆసెండ్ డీ2, ఆసెండ్ పీ1, ఆసెండ్ మేట్, ఆసెండ్ జీ740

ఎల్జీ (LG): ఎనాక్ట్ 2, లూసిడ్ 2, ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ ఎఫ్3, ఆప్టిమస్ ఎఫ్3క్యూ, ఆప్టిమస్ ఎఫ్5, ఆప్టిమస్ ఎఫ్6, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎల్2-2, ఆప్టిమస్ ఎల్3-2, ఆప్టిమస్ ఎల్3 డ్యుయల్, ఆప్టిమస్ ఎల్4-2, ఆప్టిమస్ ఎల్4 డ్యుయల్, ఆప్టిమస్ ఎల్5, ఆప్టిమస్ ఎల్5-2, ఆప్టిమస్ ఎల్5 డ్యుయల్, ఆప్టిమస్ ఎల్7, ఆప్టిమస్ ఎల్7-2, ఆప్టిమస్ ఎల్7-2 డ్యుయల్, ఆప్టిమస్ నిట్రో

శామ్‌సంగ్ (Samsung) : గెలాక్సీ ఏస్2, గెలాక్సీ ఎస్2, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ట్రెండ్2, గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ఎక్స్‌కవర్, గెలాక్సీ కోర్

సోనీ (Sony) : ఎక్సీపీరియా ఆర్క్ ఎస్, ఎక్సీపీరియా మిరో, ఎక్సీపీరియా నియో ఎల్

ఇతర కంపెనీల ఫోన్లు : ఆర్కోస్ 53 ప్లాటినం, జెడ్‌టీఈ మెమో వీ956, జెడ్‌టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, జెడ్‌టీఈ గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987, హెచ్‌టీసీ డిజైర్ 500, క్వాడ్ ఎక్స్‌ఎల్, లెనోవో ఏ820, వికో సింక్ ఫైవ్, వికో డార్క్ నైట్ జెడ్‌టీ

వెబ్ స్టోరీస్