అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పెళ్లి నిషేధం.. ఎందుకో తెలుసా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవటంపై నిషేధం విధించింది అస్సాం ప్రభుత్వం. మతం ఆమోదించినా, ప్రభుత్వ ఉద్యోగి మాత్రం రెండో వివాహం చేసుకోవాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలు జారీ చేశారు. భార్య బతికి ఉండగా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని, సర్వీస్ నిబంధనలు రెండో పెళ్లికి అంగీకరించవని స్పష్టం చేశారు. కొన్ని మతాల్లో రెండో పెళ్లి తప్పు కాదని, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా దరఖాస్తు మాత్రం తప్పనిసరి అని హిమంత స్పష్టం చేశారు. ఉద్యోగి మరణానంతరం పెన్షన్, వారసత్వ ఉద్యోగం, ఇతర ప్రయోజనాల కోసం భార్యలు కొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆ సమస్యల పరిష్కారానికి రెండో పెళ్లిపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్